Pooja Hegde: వయ్యారంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే పోజులు.. ఫొటోలు వైరల్
చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కీర్తి తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు పూజా హెగ్డే జన్మించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకొని ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది. బికినీలు ధరించి మరి హాట్ ట్రీట్ అందించింది. తన గ్లామర్, యాక్టింగ్, డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ప్రస్తుతం టాలీవుడ్ లో బడా హీరోయిన్ గా చలామణి అవుతోంది. అయితే పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ట్రీట్ తో హల్ చల్ చేస్తూ హైలెట్ అవుతోంది.

అందం, అభినయంతో..
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని తమ హవాను సుధీర్ఘంగా చూపిస్తూ నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది.

వరుస పరాజయాలతో..
ఇంతకు ముందు అనేక హిట్ లు అందుకున్న పూజా హెగ్డే.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పరాజయాలతో సతమతమైంది. అయితే ఇప్పుడు మాత్రం సినిమాల వైపు ఆచితూచి అడుగులు వేస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

మహేశ్ బాబు సరసన..
గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇంతకుముందు సూపర స్టార్ మహేశ్ బాబు సరసన మహర్షి మూవీలో నటించింది. ఈ సినిమా మహేశ్ బాబు, పూజా హెగ్డేకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో తన గ్లామర్ చూపిస్తూనే నటనతో ఆకట్టుకుంది పూజా హెగ్డే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్..
ఈ SSMB28 చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డేకు ఇటు మహేశ్ బాబుతో అటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హైలెట్ అవుతోంది ఈ బుట్టబొమ్మ.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా..
ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న పూజా హెగ్డే.. తరచుగా తన హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. వెకేషన్, ట్రావేల్, సినిమా షూటింగ్స్ తదితర వ్యక్తిగత, కెరీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో వైరల్ అవుతూ ఉంటుంది.

వయ్యారంగా పోజులు..
తాజాగా మరి కొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ ఫొటోల్లో మిర్రర్ లా, పగిలిన అద్దాల్లా కనిపించే డ్రెస్ వేసుకుని హాట్ గా అందాలను ప్రదర్శించింది. వయ్యారంగా నిల్చొని ఫొటోషూట్ లో పాల్గొంది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











