twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pooja Hegde కేన్స్‌లో మెరిసిన బుట్టబొమ్మ.. నా డ్రీమ్ అంటూ పూజా హెగ్డే ఎమోషనల్

    |

    కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022లోని రెడ్ కార్పెట్‌పై భారతీయ సినీ నటులు, నటీమణుల తళుకుబెళుకులు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. ఈ ఫెస్టివల్‌లో ప్రముఖు నటులు, రాజకీయ నేతలు, భారతీయ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ సినిమా పండుగలో కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్, ఆర్ మాధవన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, దీపిక పదుకోన్, పూజా హెగ్డే, ఊర్వశి రౌటేలా, తమన్నా భాటియా, ఐశ్వర్యరాయ్ దంపతులు తదితరులు అధికారికంగా పాల్గొన్నారు. అయితే కేన్స్ అధికారిక ఆహ్వానం అందుకొన్న పూజా హెగ్డే ఈ వేడుకలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కేన్స్‌లో పూజా హెగ్డేకు ఏం మాట్లాడారంటే..

    బుట్టబొమ్మకు అధికారిక ఆహ్వానం

    బుట్టబొమ్మకు అధికారిక ఆహ్వానం


    ప్రతిష్టాత్మకంగా మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న 75వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనమంటూ పూజా హెగ్డేకు అధికారికంగా ఆహ్వానం పంపడం విశేషంగా మారింది. ఇలా ఆహ్వానం అందుకొన్న తొలి ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా పూజా హెగ్డే కావడం విశేషం. మే 16వ తేదీన ఫ్రాన్స్‌కు బయలుదేరిన పూజా హెగ్డే మే 17, 18 తేదీల్లో ఫెస్టివల్‌లో పాలు పంచుకొంటున్నారు.

    రెడ్ కార్పెట్‌పై వాక్

    రెడ్ కార్పెట్‌పై వాక్


    కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు చేరుకొన్న పూజా హెగ్డే ఫ్రాన్స్‌లో అంతర్జాతీయ మీడియాను ఆకర్షించారు. కేన్స్ సంబరాలు ఊపందుకొన్న సమయంలో పూజా హెగ్డే అందాల అరబోతతో ఆకట్టుకొన్నారు. రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు బ్లాక్ స్కర్ట్, వైట్ టాప్‌తో గ్లామరస్‌గా కనిపించారు. పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

    నా కల సాకారమైందంటూ

    నా కల సాకారమైందంటూ


    కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. కేన్స్‌లో పాల్గొనాలనేది నా జీవిత కల. నా కలను సాకారం చేసిన కేంద్ర సమాచార మంత్రికి ధన్యవాదాలు. బ్రాండ్ ఇండియాలో భాగంగా ఈ కల నిజమైంది. బ్రాండ్ ఇండియా తరఫున పాల్గొనడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. అని పూజా హెగ్డే అన్నారు.

    భారతీయ ప్రతిష్టను పెంచేలా

    భారతీయ ప్రతిష్టను పెంచేలా


    కేన్స్‌లో అధికారికంగా పాల్గొనడం నాకు గర్వంగా ఉంది. భారతీయ సినిమాలను అంతర్జాతీయ వేడుకల్లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ కథలకు అంతర్జాతీయ వేదికలపై మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్, గోదావరి (మరాఠీ), ఆల్ఫా బీటా, గామా (హిందీ, బొంబా రైడ్ (మిషింగ్), దుని (మైతిలీ) నిరాయే థతకాలుల్ల మారమ్ (మలయాళం) చిత్రాలు ప్రదర్శించడం ఇండియన్ సినిమా ప్రతిష్టను మరింత పెంచింది అని పూజా హెగ్డే తెలిపారు.

    ఏఆర్ రెహ్మాన్‌పై ప్రశంసల వర్షం


    చారులత లాంటి సినిమాలు భారతీయ సినిమాకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఏఆర్ రెహ్మాన్, నవాజుద్దీన్ సిద్దిఖి లాంటి ప్రముఖులు భారతీయ సినిమాను ప్రపంచపటంపై పెట్టారు. రెహ్మాన్ సార్ అద్బుతంగా తన రంగంలో రాణిస్తున్నారు. ఇంకా భారతీయ సినిమా ప్రతిష్టను పెంచడానికి ఎందరో తమ సృజనాత్మకతతో కృషి చేస్తున్నారు అని పూజా హెగ్డే అన్నారు

    English summary
    Indian Actress Pooja Hegde walks at red carpet on Cannes film Festival 2022. She said, I dream fulfilled with walk at cannes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X