Pooja Hegde కు చేదు అనుభవం.. కేన్స్‌లో దారుణమైన పరిస్థితి.. ఏం జరిగిందంటే?

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అధికారిక ఆహ్వానం అందుకొన్న పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై విదేశీ మీడియాను, ఇంటర్నేషనల్ స్టార్స్‌ను అద్భుతంగా ఆకట్టుకొన్నది. అయితే తొలిసారి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన బుట్ట బొమ్మకు చేదు అనుభవం ఎదురైంది. అయితే కేన్స్ రెడ్ కార్పెట్‌పై ధగధగ మెరిసేందుకు సిద్దం చేసుకొన్న వస్తువులన్నీ మిస్ కావడంతో పూజా హెగ్డే టీమ్‌లో గందరగోళం నెలకొన్నది. పూజా చెప్పిన వివరాల్లోకి వెళితే..

 ఇండియాలో బ్యాగ్స్ మిస్సింగ్

ఇండియాలో బ్యాగ్స్ మిస్సింగ్


ఇండియాలో ఎయిర్‌పోర్టులో బ్యాగులు మిస్ అయ్యాయి. నా బ్యాగ్స్ మాత్రమే చెకిన్ అయ్యాయి. మిగితా బ్యాగులన్నీ ఫ్రాన్స్‌కు రాలేదు. తీరా ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయ్యాక అసలు విషయం తెలిసింది. దాంతో అందరిలో ఒకరకమైన ఆందోళన వ్యక్తమైంద అని పూజా హెగ్డే తెలిపారు.

బ్యూటీ ప్రోడక్ట్స్ లేకపోవడంతో

బ్యూటీ ప్రోడక్ట్స్ లేకపోవడంతో


కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై మెరువాలని బ్యూటీ ప్రొడక్ట్, డిజైనర్ దుస్తులు సిద్ధం చేసుకొన్నాం. కేన్స్‌లో మెరువాలనే కోరిక సాకారమవుతుండటంతో నా టీమ్ మెంబర్స్ రకరకాలుగా శ్రమించి.. నన్ను అందంగా తయారు చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే మేము అనుకొన్నది ఒకటి.. అక్కడికి వెళ్లే సరికి జరిగింది ఒకటి. నా బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్ బ్యాగ్ అన్నీ మిస్ కావడంతో అందరిలోను టెన్షన్ పట్టుకొన్నది అని పూజా హెగ్డే చెప్పారు.

 మేకప్ కిట్స్‌తో పాటు అన్నీ మిస్

మేకప్ కిట్స్‌తో పాటు అన్నీ మిస్


నా బ్యాగులు మిస్ కావడంతో నాతోపాటు నా టీమ్ మెంబర్స్ అంతా తినడం మానేశాం. ఏం చేయాలనే ఆలోచనల్లో పడ్డాం. రెడ్ కార్పెట్‌పైన వాక్ చేసేందుకు అవసరమైన వస్తువులు లేకపోవడంతో అందరిలో కంగారు మొదలైంది. నా బట్టలు పొగొట్టుకొన్నాను. హెయిర్ ప్రొడక్ట్స్, మేకప్ కిట్లు అన్ని పోయాయి. అదృష్టం కొద్ది కొన్ని ఇండియాలో కొన్న బంగారు నగలు నా హ్యాండ్ బాగులో ఉన్నాయి. దాంతో నేను ఊపిరి పిల్చుకొన్నాను అని పూజా హెగ్డే తెలిపారు.

రెడ్ కార్పెట్ వాక్ తర్వాతే..

రెడ్ కార్పెట్ వాక్ తర్వాతే..


అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను సంయమనంతో వ్యవహరించాను. కానీ నా మేనేజర్, ఇతర టీమ్ మెంబర్స్ బాగా భయపడ్డారు. వారి ముఖంలో ఆందోళన చూసి.. ఫర్వాలేదు. మనకు కొంచెం సమయం చిక్కింది. వెళ్లి బట్టలు, బ్యూటీ ప్రోడక్ట్స్ కొనమని చెప్పాను. వెంటనే వాళ్లందరూ వెళ్లి అవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చారు. నాతో పాటు ఎవరు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయలేదు. రాత్రి రెడ్ కార్పెట్ వాక్ ముగిసిన తర్వాతే అందరం తిన్నాం అని పూజా హెగ్డే తెలిపారు.

అద్బుతమైన రోజు అంటూ

అద్బుతమైన రోజు అంటూ


పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై మిలమిలా మెరిసింది. మీడియా, సినీ ప్రముఖుల సమక్షంలో డిజైనర్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ఫెదర్స్‌ గౌన్‌లో బుట్టబొమ్మలా కనిపించింది. ఆ తర్వాత తన అనుభూతిని గుర్తు చేసుకొంటూ.. నా జీవితంలో అద్భుతమైన రోజు అంటూ పూజా హెగ్డే తన ఇన్స్‌టాగ్రామ్ రీల్స్‌లో తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X