Pooja Hegde బుట్ట బొమ్మను తప్పించిన దిల్ రాజు.. ఆ స్టార్ హీరో సినిమా నుంచి ఎందుకు తొలగించారంటే?

అందాల తార పూజా హెగ్డే భాషాకు సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని సినీ రంగాల్లో అద్బుతంగా రాణిస్తున్నది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుండటంతో నిర్మాతలకు అదృష్టరేఖగా పూజా హెగ్డే మారిపోయింది. పూజా నటిస్తే సినిమాలు హిట్టు అనేంత నమ్మకం నిర్మాతలకు కుదిరింది. అయితే తాజాగా అగ్ర నటుడు నటించే ఓ చిత్రం నుంచి పూజా హెగ్డేను తానే స్వయంగా తప్పించినట్టు దిల్ రాజ్ మీడియాకు వెల్లడించారు. అయితే పూజా హెగ్డేను తప్పించడం వెనుక అసలు కారణం ఏమిటంటే?

పూజా హెగ్డేతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్

పూజా హెగ్డేతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్


స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరోయిన్ల ఎంపిక విషయంలో గురితప్పకుండా ఉంటారనేది ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తుంటాయి. ఆయన 50 చిత్రాల్లో హీరోయిన్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అయితే పూజా హెగ్డేను బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో తీసుకొని ఆమెకు స్టార్ స్టేటస్ ఇచ్చారు

 దిల్ రాజుతో రెండు హిట్లు

దిల్ రాజుతో రెండు హిట్లు


టాలీవుడ్‌లో పాపులారిటీ లేని సమయంలో పూజా హెగ్డే‌ను దిల్ రాజు తన సినిమాల్లోకి తీసుకొని రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేశారు. డీజే, మహర్షి చిత్రాలు పూజా హెగ్డేకు భారీ విజయాలను అందించాయి. ఆ తర్వాత పూజా హెగ్డే వెనుదిరిగి చూసుకోలేకపోయింది. ఇటీవల ఆమె నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రాధేశ్యామ్‌ చిత్రంలో పూజా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఏప్రిల్‌లో ఏకంగా రెండు సినిమాలు

ఏప్రిల్‌లో ఏకంగా రెండు సినిమాలు


ఇక ప్రస్తుతం దక్షిణాదిలో అగ్రహీరోల సరసన పూజా హెగ్డే నటించిన చిత్రాలు ఏప్రిల్ నెలలో రిలీజ్‌కు సిద్దమయ్యాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో బీస్ట్, అలాగే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో నటించిన ఆచార్య చిత్రం ఈ నెలలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బీస్ట్ ఏప్రిల్ 13వ తేదీన, ఆచార్య ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 విజయ్ సినిమా నుంచి తప్పించినట్టు..

విజయ్ సినిమా నుంచి తప్పించినట్టు..


ఇదిలా ఉండగా, దిల్ రాజు తాజాగా విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా రూపొందే సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకొన్నారట. అయితే బీస్ట్ సినిమాలో విజయ్‌తో పూజా హెగ్డే నటించడం కారణంగా.. అదే జంట రిపీట్ అయితే బాగుండదనే ఉద్దేశంతో పూజాను తప్పించాం అని దిల్ రాజు చెప్పారు.

 పూజా హెగ్డే బదులు రష్మిక మందన్న

పూజా హెగ్డే బదులు రష్మిక మందన్న

అయితే ఇటీవల బీస్ట్ సినిమా కోసం పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్‌ను ఇంటర్వూ చేస్తూ.. విజయ్ సరసన పూజాను తీసుకోవాలనుకొన్నాం. ఆ పాత్రకు పూజా అయితే సూటబుల్. కానీ వరుసగా స్టార్ హీరోతో రిపీట్ చేయడం ఇష్టం లేకపోవడం వల్ల రష్మిక మందన్నను ఎంపిక చేశాం. కానీ పూజా హెగ్డే ప్రొఫెషనల్‌ తీరు తనను ఎంతో ఆకట్టుకొంటుందని దిల్ రాజు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X