పూజా హెగ్డే మైండ్ బ్లాక్ షో.. పోగొట్టుకున్న సినిమాల కోసమే అలా.. అది చేయమంటూ!
స్టార్ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం వరుసగా ఆమె నటించిన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. దీంతో మేకర్స్ ఆమెను సినిమాల నుంచి తీసేస్తున్నారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ఊహించని విధంగా అందాలతో ఆకట్టుకుంది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలపై ఓ లుక్కెస్తే..
మోడలింగ్ : ప్రస్తుతం కాలంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోన్న అందమైన బుట్టబొమ్మ పూజా హెగ్డే. త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్న కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురుములో మూవీలో బుట్టబొమ్మ అనే పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా మారిపోయింది ఈ స్టన్నింగ్ బ్యూటి. అయితే సినిమాల్లోకి రాకముందు ముద్దుగుమ్మ పూజా హెగ్డే మోడలింగ్ రంగంలో అందాలను ఒలకబోసింది.

జీవాతో కలిసి : మోడలింగ్ లో తన అందచందాలతో అట్రాక్ట్ చేయడమే కాకుండా తన మాటలతో న్యాయ నిర్ణేతల మనసు దోచుకుంది హాట్ సుందరి పూజా హెగ్డే. నటన మీద ఉన్న ఆసక్తితో వెండితెరపైకి అడుగు పెట్టింది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి అనే చిత్రంతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. నటుడు జీవా హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో మాస్క్ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.

మనసులు కొల్లగొట్టి : మాస్క్ సినిమా తర్వాత 2014లో నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది అందాల భామ పూజా హెగ్డే. ఇందులో టైటిల్ సాంగ్ తో జనాల్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది పూజా. అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో లంగా ఓణీలతో పద్ధతిగా కనిపించి ఎంతో మంది యూత్ మనసులను కొల్లగొట్టింది.

అనుకోకుండా : అయితే పూజా హెగ్డేకు పద్ధతిగా, గ్లామర్ ఒలకబోయని ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు కెరీర్ కు అంతగా ఉపయోగపపడలేదనే చెప్పాలి. కానీ యువతోలో మాత్రం పూజా హెగ్డే మంచి స్థానం సంపాదించుకుంది. ఈ సమయంలో ఊహించని విధంగా హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లింది. అక్కడ తన ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

తనవైపుకు లాగేసుకుని : హృతిక్ రోషన్ తో పూజా హెగ్డే బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా మొహంజోదారో కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరా పరజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మళ్లీ తెలుగు బాట పట్టిన ఈ బ్యూటి అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో ఘాటుగా గ్లామర్ ఒలకబోసింది. ఏకంగా స్విమ్ సూట్ ధరించి తడిచిన అందాలతో హీట్ పుట్టించింది. దీంతో టాలీవుడ్ లో అందరి చూపును తనవైపుకు లాగేసుకుంది ఈ చిన్నది.
హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు రంగస్థలంలో జిగేలు రాణి అంటూ తెలుగు ప్రేక్షకులచేత పాడేలా చేసింది సిజ్లింగ్ బ్యూటి పూజా హెగ్డే. గతేడాది F3 మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన పాన్ ఇండియా చిత్రంలో నటించింది. వెంకటేష్ కు చెల్లెలిగా నటించిన కిసీ కి భాయ్ కిసీ కా జాన్ మూవీ కూడా అంతగా ఆదరణ పొందలేదు.
ప్రశ్నార్థకంగా : ఇలా సినిమాలు అంతగా హిట్ కాక పోవడంతో పూజా హెగ్డే సైన్ చేసిన సినిమాల నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో పూజా హెగ్డే కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. సినీ కెరీర్ ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది ఈ బుట్టబొమ్మ. తాజగా షేర్ చేసిన ఫొటోల్లో హాట గా దర్శనం ఇచ్చింది.
దేవకన్యలా : బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఫొటోల్లో వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఎంతో అందంగా దేవకన్యలా మెరిసిపోయింది. వైరల్ అవుతున్న ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు పోగొట్టుకుంటున్న సినిమా అవకాశాల కోసమే అని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మంచి స్క్రిప్స్ సెలెక్ట్ చేసుకోవడంలో కాన్సంట్రేట్ చేయమని సలహాలు సైతం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











