For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pooja Hegde డబుల్ ధమాకా.. సైమా వేదికపై అందాల జిగేల్.. అల్లు అర్జున్‌తో అలా

  |

  అందాల భామ పూజా హెగ్డే మరోసారి తన సత్తాను చాటుకొన్నది. ఈ సారి తన ప్రతిభను చాటుకొనేందుకు బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల వేదికగా చేసుకొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పూజా హెగ్గే చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను, సినీ విమర్శకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. సినిమా హిట్టా ఫట్టా అనే తేడా లేకుండా తన పాత్రలు, పాత్రల పేరుతో ఈ బుట్ట బొమ్మ తన కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా సైమా వేదికపై పూజా హెగ్గే గ్లామర్ వెలుగులు ప్రతీ ఒక్కరిని తలతిప్పుకోలేని పరిస్థితిని కల్పించాయి. ఈ సందర్భంగా పూజా హెగ్డే చేసిన ఎమోషనల్ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

  పాన్ ఇండియా హీరోయిన్‌గా

  పాన్ ఇండియా హీరోయిన్‌గా


  గత ఐదు, ఆరు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఎంచుకొంటున్న ప్రాజెక్టులు, సాధిస్తున్న విజయాలు దేశ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. స్టార్ హీరోలు, దర్శకులు ఆమె డేట్స్ కోసం కాచుకొని కూర్చొంటున్నారు. తాను పోషించే పాత్రలను పండించడమే కాకుండా గ్లామర్‌తో మరింత వన్నె తెస్తున్నారు. ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయారు.

  డీజే సక్సెస్ తర్వాత వరుస హిట్లు

  డీజే సక్సెస్ తర్వాత వరుస హిట్లు


  కెరీర్ ఆరంభంలో తడబాటు పడినా.. డీజే.. దువ్వాడ జగన్నాథం మూవీ తర్వాత పూజా హెగ్డే ఎదురు చూసుకోలేదు. తెలుగులో అరవింద సమేత, మహర్షి, అలా వైకుంఠపురంలో, రాధేశ్యామ్ లాంటి విజయాలతో కెరీర్ గ్రాఫ్‌ను రివ్వుమంటూ దూసుకెళ్లేలా చేసింది. ఇక ముందు రానున్న చిత్రాలు కూడా భారీగానే విజయం సాధించే దిశగా అడుగులేస్తున్నాయి.

  బుట్ట బొమ్మ, అరబిక్ కుత్తు పాటలతో

  బుట్ట బొమ్మ, అరబిక్ కుత్తు పాటలతో


  పూజా హెగ్డే కేవలం సినిమాలతో సరిపెట్టుకోలేదు. తాను నటించిన ప్రతీ సినిమాలోని ప్రతీ పాట బ్లాక్ బస్టర్‌గా మారాయి. బుట్టు బొమ్మ పాట గానీ, ఇటీవల విడుదలైన బీస్ట్ చిత్రంలోని అరబిక్ కుత్తు పాట సోషల్ మీడియా, యూట్యూబ్‌లో దుమ్ముదులిపేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌ చిత్రంలో ఆమె ఫెర్ఫార్మెన్స్‌, ప్రతిభకు సైమా అవార్డుల వేడుకల్లో ఉత్తమ నటి పురస్కారంతో పట్టం కట్టారు.

  నాకు అది పెద్ద కాంప్లిమెంట్..

  నాకు అది పెద్ద కాంప్లిమెంట్..


  సైమా వేదికపై పూజా హెగ్డే మాట్లాడుతూ.. నా పాత్రలు, నా పాటలతో నన్ను గుర్తుంచుకోవడం నాకు పెద్ద కాంప్లిమెంట్. యూత్ ఐకాన్ అవార్డు రావడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. ఇలాంటి రాజీలేని విషయాలు భవిష్యత్‌లో ప్రజలకు స్పూర్తిగా నిలిచేందుకు దోహదపడుతుంటాయని భావిస్తున్నాను. ఈ సందర్భంగా తనను ఎప్పుడూ ప్రోత్సహించే తల్లదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకొన్నారు. ప్రతిభ, కృషి, పట్టుదల ఉంటే అరుదైన గుర్తింపు లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటాను అని పూజా హెగ్డే అన్నారు.

  భాస్కర్, గీతా ఆర్ట్స్‌కు థ్యాంక్యూ

  భాస్కర్, గీతా ఆర్ట్స్‌కు థ్యాంక్యూ


  సైమా అవార్డుల్లో నాకు ఉత్తమ నటి అవార్డు వచ్చేలా చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసిన సైమాకు ప్రత్యేకంగా థ్యాంక్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో బలమైన హీరోయిన్ పాత్రకు నన్ను ఎంపిక చేసిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, గీతా ఆర్ట్స్‌కు థ్యాంక్యూ. విభా పాత్ర నాకు హృదయానికి నచ్చిన పాత్ర అని పూజా హెగ్డే ఎమోషనల్ అయ్యారు.

  అల్లు అర్జున్‌తో కలిసి హంగామా

  అల్లు అర్జున్‌తో కలిసి హంగామా


  సైమా అవార్డుల వేడుకలో పూజా హెగ్డే మరింత గ్లామర్‌గా కనిపించింది. యూత్ ఐకాన్ అవార్డు, ఉత్తమ నటి అవార్డులను పట్టుకొని ఫోటోలకు పోజిచ్చింది. అలాగే ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకొన్న అల్లు అర్జున్‌తో కలిసి ఫోటోకు పొజిచ్చారు. ప్రస్తుతం పూజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Pan-India actress Pooja Hegde walks away with Youth Icon honour at SIIMA Awards event. Pooja Hegde was also bestowed with the Best Actress award for Most Eligible Bachelor. Her latest photoshoot goes viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X