Pooja Hegde: బుట్టబొమ్మ లగ్జరీ ఇల్లు.. ఈ రేంజ్‌లో సంపాదిస్తుందా?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూజ హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. మిడియం రేంజ్ హీరోల నుంచి ఇప్పుడు పాన్ ఇండియా హీరోలతో కూడా ఆమె సినిమాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిమ్స్ లలో ఈ బ్యూటీ కూడా ఉంది. ఇక ఇటీవల పూజా హెగ్డే హోమ్ టూర్ చేసింది. హోమ్ టూర్ లో ఆమె తన ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఆమె లగ్జరీ ఇల్లును చూసిన తర్వాత పూజ ఆదాయం వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే బిగ్ ఆఫర్స్

మొదట్లోనే బిగ్ ఆఫర్స్

పూజా హెగ్డే మోడల్ గా మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట్లోనే ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. అయితే కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవ్వాలని పూజా హెగ్డే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే మొదట్లో ఆమెకు బాలీవుడ్ లో మాత్రం ఊహించని విధంగా మొహేంజోదరో సినిమాతో డిజాస్టర్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

అప్పటినుంచి కూడా భారీ స్థాయిలో

అప్పటినుంచి కూడా భారీ స్థాయిలో

ఎప్పుడైతే పూజా హెగ్డే, అల్లు అర్జున్ డీజే సినిమాలో బికినీలో కనిపించిందో అప్పటినుంచి కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. అలాగే ఆ తర్వాత అల.. వైకుంఠపురములో.. సినిమాలో కూడా ఆమె బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అనంతరం మహేష్ బాబు ప్రభాస్ సినిమాలలో కూడా నటించి భారీ ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది.

అలాంటి ప్రాజెక్టులపై ఆసక్తి

అలాంటి ప్రాజెక్టులపై ఆసక్తి

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పూజ హెగ్డే వరుస అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేస్తున్న బుట్ట బొమ్మ మరికొన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. అయితే ఆమె ఫోకస్ ఇప్పుడు కోలీవుడ్ చిత్ర పరిశ్రమపై కూడా మళ్ళింది. బీస్ట్ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ అక్కడ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయట.

పూజా హెగ్డే ఖరీదైన ఇల్లు

ఇక పూజ హెగ్డే మొదటిసారి తన ఇంటికి సంబంధించిన విశేషాలను ఆడియన్స్ తో పంచుకుంది. ఇటీవల ఏషియన్ పెయింట్స్ మొదలుపెట్టిన సెలబ్రిటీ హోమ్ టూర్స్ సిరీస్ లో తన ఇంటి విశేషాలను కూడా ఆమె తెలియజేసింది. ఇల్లు అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం కాబట్టి వాటిని నేను ఖర్చుకు వెనుకాడకుండా.. ఇష్టపూర్వకంగా నిర్మించుకున్నట్లు తెలియజేసింది. దీనికోసం వర్క్ చేసిన వారు మనసుపెట్టి పనిచేశారు అని ప్రతి అడుగులో కూడా నా ఇష్టాలు ఇందులో కనిపిస్తున్నాయి అని తన ఇంటి గురించి వివరణ ఇచ్చింది.

పూజా హెగ్డే ఆదాయం..

పూజా హెగ్డే ఆదాయం..

పూజ హెగ్డే ఇంటి నిర్మాణం చూసిన తర్వాత ఆమెకు సంబంధించిన ఆదాయం వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సౌత్లో అయితే మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో అయితే 4 నుంచి 5 కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రతి సంవత్సరం ఆమె ఆదాయం 30 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X