Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాన్నకు ప్రేమతో.. సర్ ప్రైజ్ చేసిన పూజా హెగ్డే
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ తాకిడిని తట్టుకోలేక ప్రపంచ దేశాలన్ని ముడుచుకుని కూర్చున్నాయి. ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టలేకపోవడంతో రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షలకు పైగా కరోనా కేసుల బయటపడ్డాయి. మన దేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.
మన దేశంలో ఇప్పటికే విధించిన లాక్ డౌన్‌ను మే 3 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. సామాన్య జనం, స్టార్ సెలెబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ గుమ్మంలోపలే ఉంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ.. క్వారంటైన్లో ఉంటున్నారు. అయితే క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్స్ ఈ లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
హీరో, హీరోయిన్లు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. వంటింట్లోకి దూరి కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. పూజా హెగ్డే సైతం వంటింట్లో గరిట తిప్పుతోంది. తీపి పదార్థాలను ఎలా చేయాలో నేర్చుకున్న పూజా.. తాజాగా తండ్రి కోసం కేక్‌ను తయారు చేసింది. పుట్టిన రోజు సందర్భంగా అర్దరాత్రి సర్ ప్రైజ్ చేస్తూ తాను తయారు చేసిన కేక్‌ను కట్ చేయించింది. నాన్నకు ప్రేమతో పూజా చేసిన ఈ పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.