twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నకు ప్రేమతో.. సర్ ప్రైజ్ చేసిన పూజా హెగ్డే

    |

    ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ తాకిడిని తట్టుకోలేక ప్రపంచ దేశాలన్ని ముడుచుకుని కూర్చున్నాయి. ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టలేకపోవడంతో రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షలకు పైగా కరోనా కేసుల బయటపడ్డాయి. మన దేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.

    మన దేశంలో ఇప్పటికే విధించిన లాక్ డౌన్‌ను మే 3 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. సామాన్య జనం, స్టార్ సెలెబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ గుమ్మంలోపలే ఉంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ.. క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్స్ ఈ లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

    Pooja Hegde Made Cake For Her Father Birthday

    హీరో, హీరోయిన్లు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. వంటింట్లోకి దూరి కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. పూజా హెగ్డే సైతం వంటింట్లో గరిట తిప్పుతోంది. తీపి పదార్థాలను ఎలా చేయాలో నేర్చుకున్న పూజా.. తాజాగా తండ్రి కోసం కేక్‌ను తయారు చేసింది. పుట్టిన రోజు సందర్భంగా అర్దరాత్రి సర్ ప్రైజ్ చేస్తూ తాను తయారు చేసిన కేక్‌ను కట్ చేయించింది. నాన్నకు ప్రేమతో పూజా చేసిన ఈ పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

    English summary
    Pooja Hegde Made Cake For Her Father Birthday. Pooja Hegde celebrated her dad Manjunath's birthday in quarantine by baking him a chocolate cake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X