Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. మొదటిసారి అత్యదిక రెమ్యునరేషన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక డిమాండ్ ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న బ్యూటీ పూజా హెగ్డే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా వరుస విజయాలను అందుకుంటోంది. సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటున్న పూజా ఈ రీసెంట్ గా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ్ లో ఇంతవరకు పెద్ద సినిమాల్లో చేయని పూజా ఫైనల్ గా ఒక ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా కోసం అమ్మడు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
బిగ్ బడ్జెట్ సినిమాలు
నెక్స్ట్ పూజా హెగ్డే రాధే శ్యామ్ తో పాటు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో రాబోతోంది. అలాగే మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో హౌజ్ ఫుల్ తో బాక్సాఫీస్ సక్సెస్ కొట్టిన పూజా ఆ తరువాత ఆఫర్స్ చాలానే వచ్చినా కథలు నచ్చక ఒప్పుకోలేదట. బాలీవుడ్ లో వీలైనంత వరకు మంచి పాత్రల్లో సక్సెస్ అవ్వాలని చూస్తోంది.
గతంలో ఆఫర్స్ ఎన్నో వచ్చినా..
టాలీవుడ్ బాలీవుడ్ అనంతరం బుట్టబొమ్మ ఫోకస్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. అక్కడ కూడా ఒక బిగ్ సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది. గతంలో ఆఫర్స్ చాలా వచ్చయట. కానీ పూజ మాత్రం తొందరపడకుండా బిగ్ హీరోతో ఛాన్స్ వస్తేనే చేయాలని వేయిట్ చేసిందట. ఇక మొత్తానికి ఈ బ్యూటీ మంచి ఆఫర్ అందుకున్నట్లు టాక్ వస్తోంది.
విజయ్ 65వ సినిమాలో
పూజా హెగ్డే ఆఫర్ అందుకుంది మరెవరితోనో కాదు. కోలీవుడ్ బాక్సాఫీస్ మాస్టర్ విజయ్ తోనే. దళపతి విజయ్ 65వ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. అయితే ఫైనల్ గా అందరు పూజ హెగ్డే వైపు చూస్తున్నట్లు టాక్ వస్తోంది. మొదట రష్మిక మందన్న అని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు బుట్టబొమ్మ ఫైనల్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇక ఫైనల్ గా అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు అలాగే బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాలు చేతుల్లో ఉండడంతో రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్. విజయ్ 65వ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే తెరకెక్కిస్తున్నారు. అందుకే ఆ సినిమా కోసం ఈ బ్యూటీ 3.5కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. ఇప్పుడే ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తోంది అంటే రాదేశ్యామ్ హిట్టుతో ఆ డోస్ మరింత ఎక్కువవవ్వడం కాయమని టాక్.