హాట్ టాపిక్‌గా పూజా హెగ్దే చీర.. 70 ఏళ్ల హిస్టరీ.. ఏముంది అందులో?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దే వెలుగొందిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య సరసన 'ఒక లైలా కోసం' చిత్రంలో నటించి మెప్పించింది. ఈ చిత్రం 2014లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూనే వచ్చింది. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ ద్వారా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో 10 ఏళ్ల కెరీయర్ ను పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తెలుగు పూజా హెగ్దే ముకుంద, అల్లు అర్జున్ సరసన 'డీజే', జూ ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత వీర రాఘవ', మహేశ్ బాబు సరసన 'మహర్షి'. గద్దలకొండ గణేశ్, అలా వైకుంఠపురంలో, ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మరోవైపు తమిళంలో తొలిచిత్రమే విజయ్ దళపతి సరసన 'బీస్ట్'లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పూజా హెగ్దే ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అక్కడి స్టార్ హీరోలకు జోడీ కడుతూ కోలీవుడ్ లో మరింతగా క్రేజ్ పెంచుకుంటోంది.

ఈ క్రమంలోనే పూజా హెగ్దే ప్రస్తుతం రెట్రో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం మే1న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలవుతోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇటు పూజా హెగ్దే కూడా ఇంటర్వ్యూలు ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా ఫొటోలను షేర్ చేస్తోంది.
అలా షేర్ చేసుకున్న ఫొటోల్లో ప్రస్తతం తాజాగా పూజాహెగ్దే చీరకట్టు ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎందుకంటే పూజా హెగ్దే కట్టుకున్న శారీకి 70 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అదివాళ్ల నాన్న కట్టుకున్న కాంచీవరం చీర కావడం విశేషం. ప్రస్తుతం రెట్రో సినిమాతో రాబోతున్న పూజా హెగ్దే ఈ శారీలో మెరిసి ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఆ చీరకట్టు కోవడంతో తన నానమ్మకు సంబంధించిన గుర్తులు వచ్చాయని చెప్పుకొచ్చింది.
వివాహాది శుభకార్యాలకు వెళ్లేప్పుడు వచ్చే మల్లెపూల వాసన, మొదటి వర్షం కురిసినప్పుడు వచ్చే మట్టివాసనను గుర్తు చేశాయని చెప్పుకొచ్చింది. ఆ కాలంలో తీపి గుర్తులు దాగి ఉన్నాయని వివరించింది. ఇక పూజా హెగ్దే కూడా తన సినిమా కోసం 70 ఏళ్ల చీరను కట్టుకోవడం, ఆ నాటి కాలాన్ని గుర్తు చేసేలా దర్శనమివ్వడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్దే పంచుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











