ప్రభాస్ సినిమాకు తలనొప్పిగా మారిన హీరోయిన్: విడుదలపై ప్రభావం పడుతుందా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాంచి ఉత్సాహంతో ఉన్నాడు. నిన్న మొన్నటి వరకూ సాదాసీదా సినిమాలు చేస్తూ వచ్చిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో 'సాహో' అనే సినిమా చేసిన అతడు.. హిందీలో ఇది చూపించిన ప్రభావం పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అదే.. 'రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది 'రాధే శ్యామ్'. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే కావొస్తుంది. మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల షూటింగ్ ఆగిపోవడం.. ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటి కారణాలతో ఈ మూవీ చిత్రీకరణ పూర్తవలేదు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. దీంతో చివరి షెడ్యూల్‌లో అవన్నీ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే షూటింగ్‌కు అందుబాటులో లేదని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Pooja Hegde Not Available for Prabhass Radhe Shyam

పూజా హెగ్డే తెలుగుతో పాటు ఎన్నో హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆ సినిమాల కోసం డేట్స్ కేటాయించిందట ఆ అమ్మడు. దీంతో 'రాధే శ్యామ్' షూటింగ్‌కు ఆమె సమయాన్ని ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే అనుకున్న సమయానికి ప్రభాస్ సినిమా విడుదలయ్యే చాన్స్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, 'రాధే శ్యామ్' యూనిట్ సంక్రాంతి కానుకగా ఓ టీజర్ వదలబోతోన్న విషయం తెలిసిందే. యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ దీని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X