అదంటే చాలా ఇష్టం.. కానీ జారిపోతుందేమో అనే అసలు భయం.. పూజా హెగ్డే ఓపెన్ కామెంట్స్

భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆధునికత బాగా విస్తరించి ఈ మధ్యకాలంలో హీరోయిన్లు చీరకట్టులో కనిపించడం తగ్గించేశారు కానీ ఓ దశాబ్దం క్రిందటి వరకు ఎందరో హీరోయిన్స్ చీరకట్టులోనే ప్రేక్షకులను బుట్టలో వేసుకున్నారు. అలాంటి చీరకట్టు తనకు ఎంతో ఇష్టమని, కాకపోతే కట్టుకోవాలంటే కొంచెం భయం అని చెబుతోంది యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఆ వివరాలేంటో చూద్దామా..

మోడ్రన్ భామ.. పూజా హెగ్డే

మోడ్రన్ భామ.. పూజా హెగ్డే

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ మోడ్రన్ భామగా యువత మనసు దోచుకుంటోంది. ఎక్కువగా మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించే ఈ బ్యూటీకి చీరకట్టుపై కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందట.

 చాలా ఇష్టం.. కానీ ఓ సమస్య ఉంది

చాలా ఇష్టం.. కానీ ఓ సమస్య ఉంది

ఓ కార్యక్రమంలో భాగంగా తనకు చీర కట్టుకోవడం అంటే తనకి చాలా ఇష్టమని చెప్పింది పూజా. చీర కట్టుకోవాలని తాను ఉబలాటపడుతుంటానని, కాకపోతే అందులో ఓ సమస్య కూడా ఉందని చెబుతోంది అందాల భామ.

అందుకే ఆ సాహసం చేయను.. జారిపోతుందేమో అనే భయం

అందుకే ఆ సాహసం చేయను.. జారిపోతుందేమో అనే భయం

చీర కట్టుకోవడం ఇష్టమే కానీ అది జారిపోతుందేమో అనే భయం తనను వెంటాడుతూ ఉంటుందని చెప్పింది పూజా హెగ్డే. అందుకే.. ఇంట్లో పూజల సమయంలో తప్పితే ఇంకెప్పుడూ చీర కట్టుకునే దైర్యం చేయనని అంటోంది. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం చీర కట్టడానికి అస్సలు సాహసించను అని పూజా చెబుతోంది.

అప్పుడు వరుణ్ తేజ్.. ఇప్పుడు అల్లు అర్జున్

అప్పుడు వరుణ్ తేజ్.. ఇప్పుడు అల్లు అర్జున్

పూజా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి గద్దలకొండ గణేష్ రూపంలో హిట్ పట్టేసిన పూజా, ఇటీవలే అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసి బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. 'అల.. వైకుంఠపురములో' సినిమాతో 2020 కి కిక్ స్టార్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Recommended Video

Pooja Hegde Caught In Driving? || Telugu
పూజా హెగ్డే హవా.. ప్రభాస్, అఖిల్

పూజా హెగ్డే హవా.. ప్రభాస్, అఖిల్


ఇకపోతే పూజా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్యాచిలర్' సినిమాలో కూడా నటిస్తోంది. టాలీవుడ్‌లో ప్రెసెంట్ ఆమె హవానే నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X