కుదిరితే నేనే చెబుతా.. తొందరపడకండి: పూజా హెగ్డే కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న పూజా హెగ్డే వరుస అవకాశాలు పట్టేస్తోంది. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలో స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో ఆమెకు కోలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్ దక్కిందని విన్నాం. తాజాగా ఈ వార్తలపై స్పందించింది పూజా హెగ్డే.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన 'అరువా' అనే సినిమాలో పూజలను తీసుకున్నారని, త్వరలోనే ఆమె సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ బలంగా వినిపించింది. దర్శకుడు హరి.. సూర్యకు సరైన జోడీ పూజానే అని, పైగా ఆమె పాపులారిటీ క్యాచ్ చేసుకోవాలని ఇలా డిసైడ్ అయినట్లుగా తెలిసింది.

అయితే తాజాగా ఈ వార్తలపై పూజ హెగ్డే స్పందిస్తూ.. తొందరపడకండి! తానింకా ఏ తమిళ సినిమాకు సైన్ చేయలేదని చెప్పింది. ''కొన్ని పెద్ద ప్రాజెక్టులైతే వచ్చాయి.. ఒకవేళ అవి కుదిరితే నేనే చెబుతాను. ఆ ప్రాజెక్టులు సెట్ అయితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు" అని పేర్కొంది పూజా హెగ్డే.
ఇకపోతే ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ అందుకున్న పూజ హెగ్డే.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఓ సినిమా, అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయడానికి సైన్ చేసింది.


Click it and Unblock the Notifications











