పూజా హెగ్డేకి రికార్డ్ రెమ్యునరేషన్... దుల్కర్ సల్మాన్ మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలారు కన్నడ కస్తూరి పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలినాళ్లలో ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. కానీ ఏమాత్రం వెనుకంజ వేయుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ మరోసారి వరుస ఫ్లాపులతో టాలీవుడ్ నుంచి జెండా పీకేయాల్సి వచ్చింది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు పూజా హెగ్డే.
పూజా కెరీర్ డౌన్
మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో నటించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు పూజా హెగ్డే. కానీ ఎంత స్పీడ్‌గా టాప్ పొజిషన్‌కు చేరుకుందో.. అంతే స్పీడ్‌గా ఇప్పుడు పాతాళానికి దిగిపోయింది. చివరికి ఐటెం సాంగ్స్ చేసుకునే స్థితికి పడిపోయింది పూజా కెరీర్.

పవన్, మహేశ్ చిత్రాల నుంచి ఔట్
ఏం జరిగిందో ఏమో కానీ పూజా కెరీర్ ఒక్కసారిగా డౌన్‌ఫాల్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. అలాగే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె తప్పుకోవడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. దాంతో కెరీర్‌లో నిలబడేందుకు పూజా హెగ్డే గట్టి పోరాటం చేస్తున్నారు. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీలో ఆమె చేసిన మౌనిక సాంగ్ మాస్‌ను ఊపేసింది. ఈ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో బీభత్సం చేసిన సౌబిర్ షహిర్‌కే క్రెడిట్ దక్కగా.. పూజా అందాలకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ
కాగా.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లో పూజా హెగ్డే రీ ఎంట్రీ ఇస్తున్నారు. చివరిసారిగా ఆచార్యలో హీరోయిన్‌గా నటించిన పూజ.. అనంతరం ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కబురు వచ్చింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఓ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దుల్కర్ కెరీర్‌లో 41వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్నారు.
పూజా హెగ్డేకు భారీ పారితోషికం
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా కోసం పూజా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. తనకు ఫ్లాపులు ఉన్నప్పటికీ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు పూజా డిమాండ్‌కు తలొగ్గినట్లుగా తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఊహాగానాల ప్రకారం పూజా హెగ్డేకు ఈ సినిమా కోసం దాదాపు 3 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లించేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ పూజా హెగ్డే క్రేజ్, డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దుల్కర్ సల్మాన్ మూవీ కాకుండా ప్రస్తుతం దళపతి విజయ్ చివరి చిత్రం జననాయగన్‌తో పాటు కాంచన 4, హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలలో నటిస్తున్నారు పూజా హెగ్డే.


Click it and Unblock the Notifications











