గుడ్ న్యూస్ చెప్పిన పూజా హెగ్డే... అంతా మీ వల్లే జరిగిందని అంటూ స్పెషల్ ఫొటో
టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కాజల్, సమంత, తమన్నా వంటి సీనియర్ బ్యూటీలకు గట్టి పోటీని ఇస్తున్న పూజా గ్యాప్ లేకుండా పెద్ద సినిమాల్లో ఛాన్సులు అందుకుంటోంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ సడన్ గా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన బుట్టబొమ్మ ఎప్పటికప్పుడు తన అనుభవాల్ని అలాగే ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెప్పుకుంటు వచ్చింది. ఇక మొత్తానికి ఈ రోజు మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్లు వివరణ ఇచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ ఒక అందమైన ఫొటోను కూడా షేర్ చేసుకుంది.

నాపై చూపించిన ప్రేమకు చాలా థాంక్స్. మీ అందరి ప్రేమ వల్లే నేను ఎంతో ఎనర్జీతో కొలుకున్నాను. దీనికి మీరే కారణం.. అంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని వివరణ ఇచ్చింది. ఇక ఇప్పటికే ప్రభాస్ తో రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న పూజా హెగ్డే ఆచార్యలో కూడా రామ్ చరణ్ కు జోడిగా నటించింది. త్వరలోనే అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ తమిళ్ లో విజయ్ కొత్త సినిమాతో బిజీ కానుంది.


Click it and Unblock the Notifications











