ఆ రోజులే బెస్ట్.. ఆ అనుభూతి మళ్లీ అంటూ పూజా హెగ్డే ఎమోషనల్
అందాల భామ పూజాహెగ్డే ఇటీవల తన కెరీర్ ఆరంభంలోని తొలి నాళ్లను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. సినిమాల్లోకి ప్రవేశించక ముందు అందాల పోటీలో పాల్గొని తన సత్తాను చాటుకొన్నారు. తాజాగా ఇండియాలోని బిగ్గెస్ట్ ఫ్యాషన్‌లో పాల్గొన్న ఈ అమ్ముడు పాత రోజులను గుర్తు తెచ్చుకొన్నారు. మిస్ ఇండియాగా ఎంపికైన ఈ బ్యూటీ మిస్ యూనివర్స్ ఇండియాగా ప్రపంచ అందాల సుందరి పోటీల్లో పాల్గొన్నారు. ఆ రోజులను గుర్తు చేసుకొన్నారు.
హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో
మిస్ ఇండియా పోటీల్లో ర్యాంప్‌పై నడిచిన ఆ రోజులను ఇప్పటికి గుర్తుంటాయి. మిస్ యూనివర్స్ ఇండియా రోజులు నన్ను ఎప్పుడూ వెంటాడుతూ మంచి అనుభూతిని పంచుతాయి. అప్పుడప్పుడే ప్రారంభమైన నా కెరీర్ తొలినాళ్లు నాకు ఎంతో గుర్తుంటాయి అని పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకొన్నారు.

మిస్ ఇండియాగా ఎంపికైన తర్వాత తొలుత మోడలింగ్ ఆ తర్వాత పలు ఫ్యాషన్ ర్యాంపులపై తన అందాలను ప్రదర్శించారు. అనంతరం బాలీవుడ్‌లోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్‌గా మారారు.
ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్‌తో కలిసి రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రంలోను నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్‌తో నటించిన రాధే శ్యామ్ చిత్రం, అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











