twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో.. గెస్ట్ రోల్ కోసం అన్ని కోట్ల రూపాయల.. బుట్టబొమ్మ రేటు మామూలుగా లేదు

    |

    సౌత్ లో సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో పూజా హగ్డేకు డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. అటు బాలీవుడ్ లో కూడా గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంటోంది. ఆమె అదృష్టం ఏమిటో గాని బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంతో ఒక్కసారిగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. చాలా వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని రిజెక్ట్ చేయాల్సి వస్తోందట. ఇక మెగా హీరో సినిమాలో గెస్ట్ రోల్ కోసం కూడా అమ్మడు గట్టి రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

    కమిట్‌మెంట్ మూవీ స్టిల్స్ : అన్వేషి జైన్, తేజస్వీ మడివాడ హాట్ గ్యాలరీ (ఫొటోలు)

    ఆ సినిమా హిట్టయిన తరువాత

    ఆ సినిమా హిట్టయిన తరువాత

    అల.. వైకుంఠపురములో సినిమా ఆమె కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అంతకుముందు వరకు రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా కండిషన్స్ పెట్టని పూజ ఆ సినిమా హిట్టయిన తరువాత మాత్రం ఒక్కసారిగా రేటు పెంచేసింది. కోటి రూపాయలకు ఒప్పుకుంటుందని అనుకున్న వాళ్ళకు మొహం మీదే రెండు కోట్లని షాక్ ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి.

    ఏ మాత్రం క్లిక్కయినా..

    ఏ మాత్రం క్లిక్కయినా..

    కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి హిట్స్ అందుకుంటోంది. ఇక త్వరలో ఆమె రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏ మాత్రం క్లిక్కయినా కూడ మరో రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ కోలీవుడ్ విజయ్ తో కూడా జత కట్టనున్నట్లు టాక్ వస్తోంది.

    ఆచార్య సినిమాలో..

    ఆచార్య సినిమాలో..

    మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా పూజా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుంది. ఆ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలో చరణ్ కు జోడిగా పూజ హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

    గెస్ట్ రోల్ కోసం అంత ఇస్తున్నారా?

    గెస్ట్ రోల్ కోసం అంత ఇస్తున్నారా?

    పూజా ఎంత బిజీగా ఉన్నా కూడా రామ్ చరణ్ పక్కన నటించడానికి ఆఫర్ రాగానే ఒప్పేసుకుందట. ఆచార్య సినిమా హిట్టయితే అమ్మడి రేంజ్ మరో లెవెల్ కు వెళ్లడం కాయం. ఇక ఆ సినిమాలో పూజ మాత్రం అరగంట కూడా ఉంటుందో ఉండదో గాని పేమెంట్ మాత్రం ఫుల్ గా వచ్చేసిందట. రెగ్యులర్ సినిమాలకు తగ్గట్లుగానే 2కోట్లకు పైగాక్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి సినిమాలో బ్యూటీ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

    Recommended Video

    Acharya Teaser On Jan 29 : Meme Makers గా మారిన మెగా హీరోలు | Chiranjeevi | Ram Charan

    English summary
    Needless to say, the mega-fans are looking forward to the first film Acharya, directed by Megastar Chiranjeevi Star Director Koratala Siva. There has already been a clarion call that the megastar will appear in a different role than ever before. Otherwise, the suspense of the release of the film is yet to go.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X