twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అవును నేనే నెంబర్ వన్'.. పొగరుపై పూజా హెగ్డే నెగిటివ్ కామెంట్స్

    |

    నెంబర్ వన్ అనే పదం సినిమా ఇండస్ట్రీలో ఒక జాదు లాంటిది. ఈ మాయా ప్రపంచంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి అర్ధం కావు. ఇక స్టార్ డమ్ అనేది గ్యారంటీ లేనిది. చూస్తుండగానే కొంతమంది స్టార్స్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోతారు. ఇక డే నైట్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్న తారలు కూడా ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి.

    పొగరెక్కితే పడిపోక తప్పదు..

    పొగరెక్కితే పడిపోక తప్పదు..

    ఇక ఎవరైనా సరే క్రమశిక్షణ మరచి పొగరుగా మారితే ఎదురుదెబ్బలు తప్పవని చాలా మంది తారల జీవితాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే విషయంలో కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెంబర్ వన్ అనే పదానికి పూజా ఎవరు ఉహించని విధంగా సమాధానం ఇచ్చింది.

    వరుస విజయాలు..

    వరుస విజయాలు..

    ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఒకే ఒక్క బ్యూటీ పూజా హగ్డే. రష్మీక మందన్న వంటి స్టార్స్ పోటీ ఇస్తున్నప్పటికి పూజ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు టాప్ స్టార్ అనే పదానికి ఇప్పుడు తాను మాత్రమే అర్హురాలినని డైరెక్ట్ గా చెప్పేసింది. నెంబర్ వన్ హీరోయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాలీవుడ్ సైడ్ కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగాలని ఈ బ్యూటీ మరొక స్ట్రాంగ్ కోరికను బయటపెట్టింది.

    నెగిటివ్ కామెంట్స్..

    నెగిటివ్ కామెంట్స్..

    పూజా హెగ్డే కామెంట్స్ కి సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్ కామెంట్స్ అందుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ నెంబర్ వన్ అనే పదానికి చాలా దూరంగానే ఉన్నారు. ఆ స్టార్ డమ్ వచ్చినప్పటికీ ఆ నెంబర్లు తమకి ఇష్టం ఉండదని పాత్రకు తగ్గట్టుగా మంచి గుర్తింపు తగ్గితే చాలని కామెంట్ చేశారు. కానీ పూజా హగ్డే మాత్రం నేనే నెంబర్ వన్ అంటూ డైరెక్ట్ గా చెప్పుకోవడం కాస్త నెగిటివ్ గా వెళుతోంది.

    Recommended Video

    Akkineni Akhil Message To His Fans On His Birthday
    బ్యూటీ అయితే సరిపోతుందా..?

    బ్యూటీ అయితే సరిపోతుందా..?

    అందంగా ఉంటే సరిపోతుందా అనే కామెంట్స్ ఈ భామ కామెంట్స్ కి కౌంటర్లుగా వస్తున్నాయి. బ్యూటీ ఒక్కటే కాకుండా యాక్టింగ్ స్కిల్స్ కొత్తగా అలవాటు చేసుకోవాలని చురకలు అంటిస్తున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అందుకుంటోంది. తెలుగులో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ తో కూడా ఒక సినిమాలో నటిస్తోంది.

    English summary
    Pooja hegde Responding to her star status, recently she opened up and said that she likes to be in the top slot and is happy with the position she has been enjoying in the Telugu industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X