ప్రభాస్ 20 కథ వినగానే పిచ్చెక్కిపోయింది.. అది ఒక ఛాలెంజ్, హీరోయిన్ క్రేజీగా!
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత జోరు పెంచాడు. బాహుబలి పూర్తి కాగానే సాహో చిత్రాన్ని ప్రభాస్ ప్రారంభించాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్ తన 20వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. సాహూ భారీ బడ్జెట్, కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతుండడంతో షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా డీజే చిత్రంతో అందాల సంచలనం రేపిన పూజా హెగ్డే ప్రభాస్ 20లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం గురించి పూజా హెగ్డే చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

టైటిల్ ఇంకా ఖరారు కాలేదు
ఇటీవల పూజా హెగ్డే సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సంధానం ఇచ్చింది. మీరు నటించే ప్రభాస్ సినిమా టైటిల్ ఏంటని అభిమానులు అడిగారు. రెండు మూడు ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫైనల్ చేయగానే మీకు చెబుతాను అని పూజా హెగ్డే తెపిపింది. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 1960 పరిస్థితుల్లో అద్భుతమైన ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

వినగానే పిచ్చెక్కిపోయింది
పూజ హెగ్డే ఈ చిత్ర కథ గురించి చెబుతూ.. తాను ఇంతవరకు ఇలాంటి చిత్రంలో నటించలేద్దు అని తెలిపింది. అద్భుతమైనా కథ. దర్శకుడు నాకు స్క్రిప్ట్ వినిపించగానే నా మతిపోయింది. ఈ చిత్రంలో నా రోల్ అంత ఈజీగా చేసేది కాదు. చాలా చాలెంజింగ్ గా ఉంటుంది అని పూజ ప్రభాస్ 20 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక అద్భుతమైన చిత్రం అవుతుందని మాత్రం హామీ ఇస్తున్నట్లు పూజా తెలిపింది.

మహర్షిలో నా పాత్ర
పూజ హెగ్డే నటిస్తోన్న మరో బిగ్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ మహర్షి చిత్రం. ఈ చిత్రంలో కూడా పూజానే హీరోయిన్. తాను ఈ చిత్రంలో అల్లరి పిల్లగా, చిన్న టౌన్ నుంచి వచ్చిన యువతిగా నటిస్తున్నానని తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మహేష్ ఈ చిత్రంలో కార్పొరేట్ సంస్థ సీఈవోగా నటిస్తున్నాడు.

వరుసగా స్టార్ హీరోలతో
పూజా హెగ్డేకి ప్రస్తుతం టాలీవుడ్ లో దక్కుతున్న అవకాశాలన్నీ పెద్ద హీరోలతోనే. డీజే చిత్రంలో అందాల ఆరబోత తర్వాత పూజ హెగ్డేకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత అరవింద సమేత చిత్రంలో, ప్రస్తుతం మహర్షి, ప్రభాస్ 20 చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పూజా హెగ్డే కెరీర్ ఆరంభంలో ఒక లైలా కోసం, ముకుంద లాంటి చిత్రాల్లో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు


Click it and Unblock the Notifications











