twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మో! పూజా హెగ్డేలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా?

    |

    ముకుంద సినిమాలో తన లేలేత అందాలతో మురిపించిన పూజా హెగ్డే దశ తిరిగింది. అల్లు అర్జున్ సరసన 'డీజే' లో చిందులేయడమే ఆలస్యం ఆమెనే కావాలంటున్నారు యంగ్ హీరోలంతా. ఉన్నట్టుండి ఒక్క సారిగా వరుసపెట్టి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో సరసన నటించే అవకాశాలు పట్టేసింది పూజా. ఇటీవలే మహేష్ సరసన మహర్షి సినిమాతో అలరించిన ఈ చిన్నది ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

    దీంతో పాటు బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 లో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తోంది పూజా. ఈ నేపథ్యంలో అమ్మడితో జోష్ ఆగడం లేదు. ఈ ఏడాది ఫుల్ ఖుషీగా కనిపిస్తోంది. మరోవైపు తన అందాలతో సోషల్ మీడియాను కూడా కుదిపేస్తూ సెక్సీ ఫొటోలతో కవ్విస్తోంది. ఈ కోణంలోనే తాజాగా ఆమె పెట్టిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో యమ హ్యాపీగా కనిపిస్తున్న పూజా ఏకంగా అమాంతం గాల్లోకి ఎగిరి ఆశ్చర్యపరిచింది.

    View this post on Instagram

    Just batshit crazy 😝😂 #onarainyday

    A post shared by Pooja Hegde (@hegdepooja) on

    తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ పిక్ పై 'జస్ట్ బ్యాట్ షిట్ క్రేజీ #వానపడే రోజు' అని ట్యాగ్ చేసింది పూజా. అంటే వర్షం పడుతున్న ఈ సమయంలో తనకెంతో సంతోషంగా ఉంది. అందుకే ఎగిరి గంతేస్తున్నా అని అర్థం. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసింది. కాగా నిన్న పూజ ఉన్న ఏరియాలో వర్షం పడేసరికి ఆమెలో ఆనందానికి హద్దులే లేవు. అయితే ఈ పిక్ లో పూజా అందాలు, ఆనందం రెండూ కనిపిస్తుండటంతో డబుల్ ట్రీట్ గా ఫీల్ అవుతూ తెగ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

    Pooja Hegdes Different Style On instagram

    'జాగ్రత్తగా ల్యాండ్ అవుతావని ఆశిస్తున్నా', 'పైన ఎవరన్నా ఉన్నారా?', 'గాల్లో ఎగురుతున్న బ్యూటీ క్వీన్', 'ఆసమ్ క్లిక్.. లవ్లీ డ్రెస్', 'జంపింగ్ జపాంగ్', 'క్రేజీ ఏంజెల్', 'ద్యావుడా.. గాల్లోకి ఎగిరింది', 'పూజా నువ్వు ఒలింపిక్స్ లో హై జంప్ చేయాల్సింది' అంటూ రకరకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూజా జోష్ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యేట్లుగా కనిపిస్తోంది.

    English summary
    Heroine Pooja Hegde now acting with Allu Arjun and Prabhas. In Social media she was posting different photos for her promotions. In these pics latestly..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X