పాపం పూజా.. ఖంగారులో నోటి వెంట సె**అనే పదం .. తెగ ఆడేసుకుంటున్న నెటిజన్లు !

వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే ఇప్పుడు అనుకోకుండా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఇది పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఆమె ఒక మాట మాట్లాడినందుకు ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆమె కావాలని ఆ పదం అనలేదు కానీ అనుకోకుండా ఆమె నోటి వెంట దొర్లిన ఒక మాటతో ఇప్పుడు తెలుగులోనే కాక మొత్తం భారతదేశం మొత్తం మీద హాట్ టాపిక్గా మారింది. దీంతో వెంటనే పూజా హెగ్డే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే

 విడుదలకు సిద్ధమై

విడుదలకు సిద్ధమై

వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్లో ఉన్న పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తోంది. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ దాదాపు స్టార్ హీరోలందరికీ మొదటి ప్రిఫరెన్స్ గా మారిపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది.

పిరియాడిక్ లవ్ స్టోరీగా

పిరియాడిక్ లవ్ స్టోరీగా

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ గోపికృష్ణ మూవీస్ బ్యానర్ ల మీద వంశీకృష్ణ, ప్రమోద్, ప్రశీద కలిసి సంయుక్తంగా నిర్మించారు.

 ప్రమోషన్స్ మీద దృష్టి

ప్రమోషన్స్ మీద దృష్టి

ఈ సినిమాలో అనేక మంది ఇతర భాషల నటులు నటించడమే కాక కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్రలో నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్లు సినిమా మీద ఆసక్తి మరింత పెంచాయి. సినిమా విడుదలకు రెండు రోజుల వ్యవధి ఉండడంతో ప్రస్తుతానికి సినిమా యూనిట్ అంతా కూడా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు.

 అసభ్యకరమైన మాట

అసభ్యకరమైన మాట

అందులో భాగంగా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు. ఆయా నగరాలకు వెళ్లిన సమయంలో పూజా హెగ్డే, ప్రభాస్, దర్శకుడు రాధాకృష్ణ సైతం మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అలా ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో పూజా హెగ్డే నోట ఒక అసభ్యకరమైన మాట బయటకు వచ్చింది.

 సెక్స్ అంటూ

సెక్స్ అంటూ


అసలు విషయం ఏమిటంటే రాదే శ్యాం ప్రమోషన్లో భాగంగా ఒక ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా చేస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా పూజా హెగ్డే మాట్లాడుతూ సక్సెస్ అనే పదం వాడడానికి బదులు సెక్స్ అనే మాట వాడింది. అయితే అసలు విషయం అర్థం అయిన వెంటనే పూజా హెగ్డే ఆ మాటను సరిదిద్దుకుంది కానీ ఇప్పుడు నెటిజనులు ఈ వైరల్ చేస్తూ పూజా హెగ్డేను ట్రోల్ చేసే పనిలో పడ్డారు.

Recommended Video

Radhe Shyam : Prabhas Cults కి పండగ షురూ.. | Tollywood | Salaar | Filmibeat Telugu
సమంత కూడా

సమంత కూడా

నిజానికి గతంలో సమంత కూడా ఇలాంటి మాట ఒకటి అనుకోని సందర్భంలో అనేసి ట్రోలింగ్ కి గురైంది. ఇప్పుడు పూజా హెగ్డే వంతు వచ్చినట్లయింది. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతో పూజా హెగ్డే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూడాలి అంటే మార్చి 11వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X