twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకే అలా అనిపిస్తే మరి వాళ్లకు.. ఇక ప్రభాస్‌తో రొమాన్సే: యంగ్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

    |

    ఆరడుగుల అందగాడు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సరసన నటించడం అదృష్టంగా ఫీల్ అవుతుంటారు యంగ్ హీరోయిన్స్. ఆ అవకాశం రావాలే గానీ ప్రభాస్ కోసం క్యూ కట్టే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి అవకాశం పట్టేసిన పూజా హెగ్డే.. తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చింది. వివరాల్లోకి పోతే..

    బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. పూజా హెగ్డే జోష్

    బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. పూజా హెగ్డే జోష్

    అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించిన పూజా హెగ్డే.. 2020 ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన కొత్త సినిమాలో నటిస్తోంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

    పూజా అందాలే స్పెషల్ అట్రాక్షన్

    పూజా అందాలే స్పెషల్ అట్రాక్షన్

    జిల్ ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసుకుంది. యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించేలా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా అందాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయట. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

    నాకే అలా అనిపిస్తుందంటే.. ఇక వాళ్ళు

    నాకే అలా అనిపిస్తుందంటే.. ఇక వాళ్ళు

    కాగా తాజా ఇంటర్వ్యూ ప్రభాస్ గురించి మాట్లాడిన పూజా.. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ మూవీలో ప్రభాస్ లుక్ ఉండనుందని తెలిపింది. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ఓ విజువల్ వండర్‌గా ఉంటుందని చెప్పింది. షూటింగ్ దశలోనే నాకే అలా అనిపిస్తుందంటే.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Prabhas In Trouble, Prabhas20 Film Shooting Held in Georgia
    ఇక ప్రభాస్‌తో రొమాన్సే

    ఇక ప్రభాస్‌తో రొమాన్సే

    సెట్‌లో ప్రభాస్ అందరితోనూ చాలా కలివిడిగా ఉంటూ సరదాగా గడుపుతుంటారని పూజా చెప్పింది. ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని, ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా బాగుంటుందని తెలిపింది. ఇక తర్వాతి షెడ్యూల్‌లో ప్రభాస్‌కు, తనకు మధ్య రొమాంటిక్ సీన్స్‌ రూపొందించనున్నారని, అవి సినిమాకే హైలైట్ అయ్యేలా ఉంటాయని చెప్పింది.

    English summary
    After Saaho, Prabhas is concentrating on his upcoming film With Radha Krishna Kumar. In this movie Pooja Hegde acting as heroine. In latest interview she says about Prabhas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X