పూజా హెగ్డేకు తప్పని కరోనా కష్టాలు.. ఎయిర్‌పోర్టులో బుట్టబొమ్మ ఇలా..
కరోనా వైరస్ కష్టాలు సినిమా పరిశ్రమను విపరీతంగా వేధిస్తున్నాయి. తాజా కోబ్రాతోపాటు పలు చిత్రాలు తమ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకొన్నాయి. అయితే ఈ కరోనా కష్టాలు మాత్రం పూజా హెగ్డేను వదల్లేదు. ప్రభాస్‌తో కలసి నటిస్తున్న సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతున్నది. కానీ ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తున్న సమయంలో షూటింగ్‌కు హాజరుకాక తప్పలేదు. దాంతో ఆమె జాగ్రత్తలు తీసుకొంటూ జార్జియాకు ప్రయాణం కట్టింది. ముఖానికి మాస్క్ కట్టుకొని ఎయిర్‌పోర్టులో ఇలా దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ మూవీ షూట్ కోసం
పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రభాస్20 మూవీ షూట్‌లో పాల్గొనక తప్పలేదు. సినిమాపై ఉండే ప్రేమ కారణంగా కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. నేను జార్జియాకు ఇప్పుడే చేరుకొన్నాను. ప్రభాస్‌తో కలిసి థీమ్ సాంగ్‌లో పాల్గొంటాను అని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు నుంచి పూజా హెగ్డే ట్వీట్ చేసింది.

ప్రభాస్ కూడా మాస్క్‌తో
కొద్ది రోజుల క్రితం కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ముఖానికి మాస్క్ ధరించి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. తన కెరీర్‌లో 20వ సినిమా కోసం జార్జియాకు బయలు దేరుతూ మీడియా కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల జార్జియాలో ఓ ఛేజింగ్ సీన్‌ను పూర్తి చేశారని చిత్ర యూనిట్ ప్రకటించింది.

పూజా హెగ్డే కెరీర్ ఇలా
ఇటు టాలీవుడ్‌లోను అటు బాలీవుడ్‌లోను వరుస విజయాలను చేజిక్కించుకొంటూ దూసుకెళ్తున్న అందాల భామ అరవింద సమేత. తెలుగులో అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకొన్నది. దాంతో ఈ బుట్టబొమ్మ చేతిలో దండిగా సినిమాలు వచ్చి పడ్డాయి.
Recommended Video


పూజా హెగ్డే చేస్తున్న ప్రాజెక్టులు
ఇప్పుడు ప్రభాస్‌తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న Prabhas20 చిత్రంతోపాటు అఖిల్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో నటిస్తున్నది. అంతేకాకుండా పలు చిత్రాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి. హిందీలో ఫర్హాద్ సమ్జి దర్శకత్వంలో వస్తున్న కభీ ఈద్ కభీ దివాళీ అనే సినిమాలో సల్మాన్‌తో సరసన నటించే అవకాశం చేజిక్కించుకొన్నది.


Click it and Unblock the Notifications











