అది మాత్రం ఫుల్లుగా ఉంది.. కానీ ఎక్కడికీ వెళ్లలేనంటోన్న పూజా హెగ్డే
కరోనా దెబ్బకు సాధారణ ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచించడం తెలిసిందే. అందుకే ఎంతో బిజీగా ఉండే హీరో, హీరోయిన్లు సైతం ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. అయితే అక్కడ సమయాన్ని వృథా చేయకుండా వర్కౌట్లు చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు.
రకుల్ ప్రీత్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఇంట్లోనూ వ్యాయామాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. బయటకు వెళితే ఎక్కడ కరోనా సోకుతుందో అని బయపడి పోతున్నారు. కరోనాను కట్టడి చేసే భాగంలోనే టాలీవుడ్ మొత్తం మూగబోయింది. అన్ని షూటింగ్స్‌ను రద్దు చేయాలని చిత్రసీమ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని తెలిపింది.

తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన పిక్స్, కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 'ఫ్యూయెల్ మాత్రం బాగానే నిండి ఉంది.. కానీ ఎక్కడికి వెళ్లలేను.. ఇంట్టోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి.. కరోనా సమయంలో జీవితం ఇలానే ఉంటుంద'ని పోస్ట్ చేసింది. రీసెంట్‌గా జార్జియా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఇండియాకు వచ్చిన పూజా విరామం తీసుకుంటుంది.


Click it and Unblock the Notifications











