మళ్ళీ రెచ్చిపోయిన పూజా హెగ్డే.. బికినీలో మరో పిక్ తో రచ్చ.. అలా చేయి అడ్డుపెట్టి కైపెక్కిస్తూ!
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా హెగ్డే తన హాట్ ఫొటోస్ తో రచ్చ రేపుతోంది. తెలుగులో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా ఉన్న ఆమె బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమె హిందీలో కొన్ని సినిమాలు చేస్తోంది. ఈ మధ్య మాల్దీవ్స్ కి వెళ్ళిన ఆమె అక్కడ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ రేపింది. తాజాగా ఆమె మరో ఫోటో షేర్ చేయగా అది కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఫ్యాషన్ షోస్ లో ఎంట్రీ ఇచ్చి
కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రులు ముంబైలో సెటిల్ అయ్యారు, అక్కడే ఆమె కూడా జన్మించింది. చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తితో అనేక ఫ్యాషన్ షోస్ లో ఈ భామ పాల్గొంది. ఆమెకు అతి తక్కువ కాలంలోనే పలు బ్రాండ్ ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లో నటించే అవకాశం దక్కింది.

ముగమూడి అనే సినిమాతో
అలా పలు రకాల యాడ్స్ చేసిన తర్వాత అమ్మడికి సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. అలా ఆమె ముగమూడి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమా ఛాన్స్ రావడానికి అది ఉపయోగపడింది.

ఒక లైలా కోసం సినిమాతో
తెలుగులో 2014 లో ఒక లైలా కోసం సినిమాతో పరిచయం అయిన ఆమె ఆ తర్వాత ముకుంద సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు బాలీవుడ్ లో నటించే అవకాశం దక్కించుకుంది. హృతిక్ రోషన్ హీరోగా మొహంజదారో సినిమా అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవడంతో అమ్మడికి ఆఫర్స్ పెద్దగా అయితే వచ్చి పడలేదు.
బికినీలో కనిపించి
అయితే ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథం సినిమాలో బికినీలో కనిపించి అలరించిందో ఒకరకంగా అప్పటి నుంచి ఆమె లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి గద్దలకొండ గణేష్ సినిమాలు అన్నీ వరుస హిట్స్ కొట్టడంతో మంచి క్రేజ్ సంపాదించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలువగా ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంది.

మాల్దీవ్స్ ట్రిప్ కి
అయితే ఇక ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ తో అందరినీ ఆకట్టుకునే ఈ భామ తాజాగా మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ హాట్ ఫోటోలు వరుసగా షేర్ చేస్తూ వస్తోంది. బీచ్ లో పూజ మైమరచిపోయి బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. పూజా హెగ్డే బికినీ లో సెక్సీ లుక్స్ తో హీట్ పెంచేస్తోంది. మరి మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











