Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Pooja Hegde ఓ ఇంటిదైన బుట్టబొమ్మ.. సొంత ఇంటి కల అంటూ ఎమోషనల్ పోస్ట్
ఎవరికైనా సొంత ఇంటి కల సాకరం ఓ మధురానుభూతి. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి జీవితాంతం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. అయితే కెరీర్ జోరుగా సాగుతుండగానే పూజా హెగ్డే సొంత ఇంటిని సాకారం చేసుకొన్నది. ముంబైలో గృహ ప్రవేశం చేసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయగా.. నెటిజన్లు సంతోషంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మిస్ ఇండియా పోటీలతో
పూజాహెగ్డే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. 2009లో మిస్ ఇండియా టాలెంటెడ్‌గా ఎంపికైంది. అలాగే 2010లో మిస్ యూనివర్స్ ఇండియా సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

వరుస వైఫల్యాలు, బ్లాక్బస్టర్లు
మిస్ ఇండియా పోటీల్లో పాలొన్న తర్వాత తొలిసారి 2012లో మిస్కిన్ దర్శకత్వంలో ముగమూడి చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక లైలా కోసం, ముకుంద, హిందీలో హృతిక్ రోషన్ నటించిన మొహంజదారో చిత్రాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అయితే దువ్వాడ జగన్నాథం సినిమాతో తన అదృష్ట రేఖ మారిపోయింది. ఆ తర్వాత అరవింత సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్‌ఫుల్ 4, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతో బ్లాక్బస్టర్లను అందుకొన్నారు.

మాల్దీవుల్లో హంగామా చేస్తూ..
టాలీవుడ్, బాలీవుడ్లో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే విదేశీ విహారయాత్రలు, హాట్ హాట్ ఫోటోషూట్‌తో సందడి చేస్తున్నది. ఇటీవలే మాల్దీవుల పర్యటనకు వెళ్లి వచ్చిన పూజాహెగ్డే.. సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో హాట్ హాట్‌గా కనిపించింది. మాల్దీవుల నుంచి ముంబైకి చేరుకొన్న బుట్టబోమ్మ గత ఏడాది తన గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

బాంద్రాలో త్రీ బెడ్రూం ఫ్లాట్‌తో
గతేడాది జనవరిలో ముంబైలోని బాంద్రాలోని విలాసవంతమైన మూడు బెడ్రూమ్ ఫ్లాట్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏడాది క్రితం పాల్గొన్న గృహ ప్రవేశం నాటి ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ఎమోషనల్ అయ్యారు. ఈ ఇంటికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది అంటూ బుట్ట బొమ్మ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.

సొంతింటి కలకు ఏడాది పూర్తి అంటూ..
పూజా హెగ్డే గృహ ప్రవేశం సందర్బంగా సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా.. చేతిలో కొబ్బరికాయతో పూజ చేస్తూ కనిపించారు. ఆ నాటి ఫోటోను షేర్ చేస్తూ.. గ్రాటిట్యూడ్కు సరిగ్గా ఏడాది పూర్తయింది. సొంతింటి కల పూర్తయింది. హార్డ్ వర్క్, నీపై నీకు ఉండే భరోసాను నమ్ముకోవాలి. నిజాయితీగా కష్టపడితే మంచి హృదయంతో ప్రపంచం మొత్తం నీ ముందు మోకరిల్లుతుంది అని తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.

పూజా హెగ్డే రాబోయే సినిమాలు..
ఇక పూజా హెగ్డే సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆమె నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. వాస్తవానికి సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక రాంచరణ్‌తో ఆచార్య, విజయ్‌తో బీస్ట్, హిందీలో సర్కస్ చిత్రంలో నటిస్తున్నారు.