బ్రా లాంటి టాప్‌లో పూజా అరాచకం: సైడ్ నుంచే చూపిస్తూ రెచ్చగొడుతోందిగా!
మైమరపించే అందం, ఆకట్టుకునే నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిన ఈ భామ.. టాలీవుడ్‌లో హవాను చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ క్యూట్ హీరోయిన్ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. అదే సమయంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. దాన్ని మీరే చూసేయండి!
ఆరంభంలోనే నిరాశగా
పూజా హెగ్డే టీనేజ్‌లోనే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత పూజా బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా సక్సెస్ మాత్రం దరిచేరలేదు.

అక్కడి నుంచి స్పీడుగా
హీరోయిన్‌గా సరైన ఆరంభాన్ని అందుకోని పూజా హెగ్డేకు అవకాశాలు మాత్రం భారీగానే వచ్చాయి. అప్పుడే ఈ అమ్మడు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొదటి హిట్ కొట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని పూజా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.
రిజల్ట్‌తో పని లేకుండా
చాలా కాలం పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి హవాను చూపించిన పూజా హెగ్డే.. ఇటీవలి కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో సతమతం అవుతోంది. గత ఏడాది ఆమె నటించిన 'రాధే శ్యామ్', 'ఆచార్య' మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి. దీనికితోడు తమిళంలో నటించిన 'బీస్ట్' మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం వస్తున్నాయి.

హిందీ, తెలుగులో ఇలా
పూజా హెగ్డే ఈ ఏడాది బాలీవుడ్‌లో 'సర్కర్' అనే సినిమాతో వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, ప్రస్తుతం ఈ సుందరాంగి త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. అలాగే, సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' అనే సినిమానూ చేసింది. అలాగే, దక్షిణాదిలోని భాషల్లోనూ నటిస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా మారింది.
సోషల్ మీడియాలో బిజీ
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ వెళ్తోంది.

అందాల విందు చేస్తూ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో పూజా హెగ్డే పేరు తరచూ ట్రెండింగ్ అవుతోంది.
పూజా హెగ్డే సెల్ఫీ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అద్దం ముందర నిల్చుని బ్రా లాంటి టాప్‌లో సైడ్ యాంగిల్ సెల్ఫీ దిగింది. అలాగే, కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఘాటు ఫోజు ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతోంది.



Click it and Unblock the Notifications











