అందాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన పూజా హెగ్డే.. గేట్లు ఓపెన్ చేసి పరువాల విందు
దక్షిణాది అగ్ర హీరోయిన్లలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఒకరు. చిన్న సినిమాతో సినీ రంగంలోకి ఎంటర్ అయినా ఈ సొగసరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం అంటూ బాషా బేధం లేకుండా సినిమాలు చేస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో హిట్లకంటే ఎక్కువగా ప్లాప్స్ చవిచూసింది ఈ గ్లామరస్ బ్యూటి. సైన్ చేసిన సినిమాల నుంచి కూడా తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతోంది ఈ చిన్నది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఫొటోలపై లుక్కేస్తే..

అలా ముద్దు పేరు: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోన్న ది గ్లామరస్ డాల్ పూజా హెగ్డే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ అల వైకుంఠపురుములో సినిమాతో బుట్టబొమ్మగా మారిపోయింది. ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాటతో తెలుగు ప్రేక్షకుల్లో అలా ముద్దుగా పేరు తెచ్చుకుంది ఈ స్టన్నింగ్ బ్యూటి.

విశ్వసుందరి పోటీలు: ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో అందాలను ఒలకబోసింది. 2010లో నిర్వహించిన విశ్వ సుందరి పోటీల్లో భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసిన పూజా హెగ్డే సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది.

సూపర్ హీరో మూవీ: బుట్టబొమ్మ పూజా హెగ్డే 2012లో తమిళంలో వచ్చిన సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ మూగమూడితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. జీవా హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో మాస్క్ అనే టైటిల్ తో విడుదల చేశారు. అనంతరం తెలుగు సినీ ఇండస్ట్రీకి 2014 అక్టోబర్ లో వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో పరిచయం అయింది. ఇందులో నాగ చైతన్యతో ఆడిపాడింది ఈ బ్యూటి.

ఎదురుదెబ్బలు: ఒక లైలా కోసం సినిమా తర్వాత అదే 2014 సంవత్సరం డిసెంబర్ లో ముకుంద మూవీ చేసింది పూజా హెగ్డే. తొలి రెండు తెలుగు సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించి అట్రాక్ట్ చేసింది పూజా హెగ్డే. తర్వాత హిందీ చిత్ర సీమలోకి మొహంజోదారో మూవీతో అడుగు పెట్టింది ఈ చిన్నది. అయితే పూజా చేసిన మొదటి 4 సినిమాలు అంతగా హిట్ కాలేదు. ఆమెరు కెరీర్ ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

వరుస ప్లాప్స్: డీజే సినిమాతో గ్లామర్ ఒలకబోసిన పూజా హెగ్డే తర్వాతి కాలంలో మంచి హిట్స్ అందుకుంది. ఐటమ్ సాంగ్ చేసి కూడా ఆకర్షించింది. కానీ, ఈ మధ్య మళ్లీ వరసుగా డిజాస్టర్ సినిమాలతో పూజా హెగ్డే కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసీ కి భాయ్ కిసీ కా జాన్, సర్కస్ సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. గుంటూరు కారం సినిమాకు మెయిన్ హీరోయిన్ గా సైన్ చేసిన తప్పుకోవాల్సి వచ్చింది.

షైనింగ్ పరువాలతో: ఇలా కెరీర్ లో సినిమాల పరంగా ఓటమి చూస్తున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం అందాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతోంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో నవ్వుతూ వయ్యారంగా పోజులిచ్చింది. దీంట్లో ఒళ్లంతా కప్పుకున్న గేట్లు ఓపెన్ చేసినట్లుగా పరువాలు మాత్రం ఆకర్షిణీయంగా దర్శనం ఇస్తున్నాయి. పూజా హెగ్డే షైనింగ్ అందాలు అట్రాక్టే చేయడంతో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











