గురువు చేసిన పనికి షాక్.. అలా చేయడంతో ఆశ్చర్యపోయిన పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. లాక్ డౌన్‌లో పూజా చేసిన అల్లరి, సమంతపై చేసిన కామెంట్స్, ఆపై హ్యాక్ అయిందంటూ ప్లే చేసిన డ్రామా.. అనంతరం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇలా ఎన్నో రకాలుగా పూజా హెగ్డే వార్తల్లో నిలిచింది. ఇక ఈ మధ్యే షూటింగ్ సెట్‌లోనూ అడుగుపెట్టింది. తాజాగా ఆమ తన గురువు చేసిన పనికి షాక్ అయింది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

లాక్డౌన్‌లో అలా..
పూజా హెగ్డే లాక్టౌన్‌లా ఫుల్ సందడి చేసింది. ఇంట్లో వారికి వండి పెట్టుకుంటూ.. సేవలు చేయించుకుంటూ ఎంతో సరదాగా గడిపింది. తండ్రికి బర్త్ డే సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. మ్యూజిక్ కూడా నేర్చుకుంది. కొత్త కొత్తగా వంటకాలు నేర్చుకుంటూ మాస్టర్ చెఫ్ రేంజ్‌లో ఎదిగింది.

సమంతపై కామెంట్..
ఇక మజిలీ సినిమా చూస్తున్న పూజా హెగ్డే సమంతపై కామెంట్ చేసింది. ఆమె మరీ అంత అందంగా లేదని సెటైర్ వేసింది. ఆపై తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ కాకమ్మ కబుర్లు చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటన నేషనల్ వైడ్‌గా వైరల్ అయింది.

మందులో స్టఫ్..
తాజాగా పూజా హెగ్డే మళ్లీ గరిట పట్టుకుంది. తన తండ్రి మందు తాగుతూ ఉంటే పెగ్గులు కలిపి ఇచ్చింది. అంతేకాకుండా దగ్గరుండి మరీ ఇష్టమైన స్టఫ్ వండి పెట్టిందట. ఎంతైనా పూజాహెగ్డే రేంజ్ వేరు. ఇక తాజాగా తన గురువు చేసిన ఫీట్స్, యోగాసానాలు చూసి దెబ్బకు షాక్ అయింది.

యోగా గురువు..
పూజా హెగ్డే యోగా చేస్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన గురువు మిహిర్ జోగ్.. ఆన్ లైన్ ద్వారా క్లాసులు తీసుకున్నాడు. ఆయన తన కాలుని పైకి లేపి మడతబెట్టిన తీరుకు ఆశ్చర్యపోయింది. అందుకే అతను గురువు అయ్యాడు.. నేను శిష్యురాలిని అయ్యాను అని తెలిపింది. ఇక ఇలాంటి విన్యాసాలు ఎలాంటి పర్యవేక్షణా లేకుండా చేయకండని సూచించింది.
Recommended Video

సెట్స్‌లోకి దిగింది..
పూజా హెగ్డే ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సెట్‌లోకి అడుగుపెట్టింది. దీని తరువాత మళ్లీ రాధేశ్యామ్ కోసం డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఇలా బుట్టబొమ్మ వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే రాధేశ్యామ్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.


Click it and Unblock the Notifications











