ముఖం చాటేస్తున్న పూజా హెగ్డే.. పనైపోయిందిగా బుట్టబొమ్మకు ఆ అవసరం లేదట?
ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అనుకునే వారు సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ఉంటారు. ఇక హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉంది. సీనియర్ హీరోయిన్స్ తో స్టార్ హీరోలు నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అందరు పూజా హెగ్డే వైపే ఎక్కువగా చూస్తున్నారు. ఇక యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Recommended Video

అల..హిట్టుతో..
టాలీవుడ్ లో అనుష్క, సమంత, కాజల్, తమన్నా వంటి సీనియర్ హీరోయిన్స్ కి పూజ గట్టి పోటీని ఇస్తోంది. కుర్ర హీరోలు సీనియర్ హీరోలు అందరూ కూడా పూజా హెగ్డేతో నటించడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అల..వైకుంఠపురములో.. సినిమాతో అమ్మడి క్రేజ్ మరీంత పెరిగింది. గ్యాప్ లేకుండా ఆఫర్స్ వస్తున్నాయి. రెండేళ్ల వరకు ఫుల్ బిజీ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోంది.

రెమ్యునరేషన్ డోస్..
అల్లు అర్జున్ తో రెండవసారి బాక్సాఫీస్ సక్సెస్ అందుకోవడంతో పూజా హగ్డే క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక సడన్ గా పూజా హెగ్డే రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేసిందట. ఏదైనా ఫామ్ లో ఉన్నపుడే సెట్ చేసుకోవాలని నాలుగు రాళ్లు వెనకేసుకుంటోందట. ఇక త్వరలో పూజా టాలీవుడ్ కి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

బాలీవుడ్ కోసం..
ఏ హీరోయిన్ అయినా సరే బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తే మిగతా ఇండస్ట్రీల వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. అదే తరహాలో పూజా కూడా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్న అమ్మడు మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.

ప్రభాస్ సినిమా తరువాత..
ప్రభాస్ కొత్త సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే అఖిల్ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇక ప్రభాస్ సినిమా అనంతరం పూజా హెగ్డే పూర్తిగా బాలీవుడ్ లో మకాం వేయనుందట. సల్మాన్ తో సక్సెస్ అందుకొని అక్కడ బిజీ అవ్వాలని అనుకుంటోంది. మరి బుట్టబొమ్మ లక్కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











