నన్ను నాశనం చేసేందుకు కుట్ర.. భారీగా డబ్బు ఇచ్చి అంటూ పూజా హెగ్డే!
తెలుగు సినిమా దగ్గర ఓ రేంజ్ లో పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధానంగా కనిపిస్తుంది. కాగా వరుస హిట్స్, బ్లాక్ బస్టర్ లతో గోల్డెన్ లెగ్ గా రష్మిక ఇపుడు కొనసాగుతుంది. ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా హిందీ సినిమాలో కూడా రష్మిక పట్టిందల్లా బంగారం అవుతుంది.
కాగా తనకి ముందు ఇదే రేంజ్ లో ఎంతో ఫేమ్ అందుకున్న హీరోయిన్ మాత్రం డెఫినెట్ గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే అని చెప్పవచ్చు. కాగా పూజా హెగ్డే గత కొన్నేళ్ల కితం ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్టు అనే మార్క్ ఉంది. ఇంకా చెప్పాలంటే పలువురు ప్లాప్ హీరోలు సైతం పూజా హెగ్డేతో సినిమా చేసి హిట్ కొట్టాలని చూసినవారు హిట్ కూడా అందుకున్న వారు లేకపోలేరు.

ఇలా ఒక టైం లో అలా పూజా హెగ్డే హవా సౌత్ సినిమా దగ్గర నడిచింది. మెయిన్ గా తెలుగు సినిమాలో గట్టిగానే స్టార్డంని చూసేసింది. కానీ ఇపుడు తెలుగు సినిమాకి దూరం అయ్యిన పూజా హెగ్డే నుంచి తన కెరీర్లో అందుకున్న కొన్ని ఊహించని అంశాలు రివీల్ అయ్యాయి. పూజా హెగ్డే ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆమె తెలుగులో చేసిన పలు సినిమాల విషయంలో గట్టి ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
మెయిన్ గా తాను ఫామ్ లో ఉన్న సంవత్సరాల్లోనే సోషల్ మీడియాలో తనపై గట్టి ట్రోల్స్ పడ్డాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమాల్లో పూజా హెగ్డే నటనపై చాలానే ట్రోల్స్ సోషల్ మీడియాలో అప్పట్లో కనిపించాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాల్లో పూజా హెగ్డేపై ఆ మధ్య అంతా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచేది.
కాగా వీటిపై పూజా హెగ్డే ఇటీవల బాలీవుడ్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై ఈ ట్రోల్స్ అన్నీ కావాలని కొందరు చేయించినట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకి ఎందుకు ఇంతలా ట్రోల్స్ చేస్తున్నారో అర్ధం అయ్యేది కాదు అని తన కుటుంబం కూడా ఆ ట్రోల్స్ విషయంలో బాధ పడ్డారని తెలిపింది. ఇంతే కాకుండా తనపై కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయించారు అని తెలుసుకున్నట్టుగా షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చింది.
అయితే ఆ తర్వాత తనపై ఎవరైతే ఇలా డబ్బులిచ్చి చేయిస్తున్నారో వాళ్ళ కంటే నేను ఒక మెట్టు ఎదిగి ఉన్నాను కాబట్టే తనని కిందకి దించాలని చూస్తున్నారని వారి విషయంలో జాలి పడ్డట్టు తెలిపింది. మరి తనని అంతలా ఎవరు పగ పెట్టారో రివీల్ చేయలేదు కానీ తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇలా పూజా హెగ్డే పై మాత్రం ఆ మధ్య గట్టిగానే టార్గెట్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. కాగా ఇపుడు పూజా హెగ్డే ఒక్క తమిళ్ లో మాత్రమే ఎక్కువ సినిమాలు చేస్తుండగా హిందీలో కూడా ఒకటీ రెండు సినిమాలు ఆమె చేస్తుంది.


Click it and Unblock the Notifications











