twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pooja Hegde: మూడు డిజాస్టర్స్ వచ్చినా అత్యధిక రెమ్యునరేషన్.. బుట్టబొమ్మ న్యూ రికార్డ్

    |

    సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది వరకు వరుస విజయాలతో మంచి క్రేజీ అందుకున్న పూజా హెగ్డే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుత జనరేషన్ లో అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న బ్యూటీలతో టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. ఆమె ఇంతవరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెద్దగా చేయక పోయినప్పటికీ కూడా స్టార్ హీరోలతో పోటీపడుతూ క్రేజ్ అందుకుంటోంది. అయితే ఇటీవల మరొక సినిమా కోసం అత్యధిక పారితోషికం అందుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

    అల వైకుంఠపురములో సినిమా నుంచి బుట్ట బొమ్మ దూకుడు మాములుగా లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటూ వచ్చాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆమె వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలను ఎదుర్కోవలసి వచ్చింది. మొదట రాధే శ్యామ్ సినిమా ఏ స్థాయిలో ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అనంతరం విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా కూడా దాదాపు అదే తరహా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

     pooja hegde shocking remuneration for vijay devarakonda janaganamana project

    ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ ఆచార్య కూడా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పూజా అయితే మంచి అవకాశాలు అందుకుంటోంది. అంతే కాకుండా పారితోషికం విషయంలో కూడా డోస్ పెంచుతూ ఉండడం విశేషం. ఇటీవల జనగణమన ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే మెయిన్ హీరయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

    అయితే జనగణమన కోసం పూజా దాదాపు 5కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా ఈ రేంజ్ లో గతంలో ఎప్పుడు డిమాండ్ చేయని పూజా షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. తమిళంలో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు హిట్టయితే అమ్మడి రేంజ్ ఇంకా ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

    English summary
    pooja hegde shocking remuneration for vijay devarakonda janaganamana project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X