Pooja Hegde: పొట్టి బట్టల్లో పూజా హెగ్డే రచ్చ.. ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!
చూడ చక్కని రూపం.. చూపు తిప్పుకోకుండా చేసే అభినయం.. అప్పుడప్పుడూ మజాను పంచేలా గ్లామర్ ట్రీట్.. ఇలా సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ఇమేజ్‌తో స్టార్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్ ఆరంభంలో పెద్దగా హిట్లు రాకున్నా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ భామ.. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది, ఉత్తరాది భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూసేయండి!

అలా ఎంట్రీ.. ఆరంభంలో షాక్
పూజా హెగ్డే టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో సందడి చేసి ఫేమస్ అయింది. అప్పుడే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. ఇవీ మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

అప్పటి నుంచి వరుస హిట్లతో
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా కాలం పాటు హిట్ కోసం వేచి చూసిన పూజా హెగ్డే 'అరవింద సమేత.. వీరరాఘవ'తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది.

ఆ మూవీతో షాక్.. బీస్ట్‌తో మళ్లీ
వరుస విజయాలు అందుకోవడం వల్ల పూజా హెగ్డే రేంజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఆమె ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది డిజాస్టర్‌గా మిగలడంతో షాక్ తగిలింది. ఇక, ఇప్పుడు పూజా హెగ్డే.. విజయ్ 'బీస్ట్'తో రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రమోషన్స్‌తో బిజీగా గడుపుతోంది.

భారీ ప్రాజెక్టుల్లో భాగమైన నటి
టాలీవుడ్‌లో పూజా హెగ్డే హవా మామూలుగా లేదు. ప్రతి పెద్ద ప్రాజెక్టుకు ఫస్ట్ చాయిస్ ఆమెనే అవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ బుట్టబొమ్మ 'ఆచార్య' సినిమాను పూర్తి చేసుకుంది. అలాగే, హరీశ్ - పవన్ కలయికలో వచ్చే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న సినిమాలోనూ నటించబోతుంది. మరిన్ని చర్చల దశలో ఉన్నాయి.

అక్కడ మాత్రం యమ బిజీగా
వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తోన్న పూజా
పూజా హెగ్డే సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ షేర్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా వదులుతోంది. ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

పొట్టి బట్టల్లో హాట్ షో చేస్తూ
తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పొట్టి గౌను ధరించి మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్స్ క్షణాల్లో విపరీతంగా వైరల్ అయిపోయాయి. వీటిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











