ట్రెండింగ్ లో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. ఒక్క పాటకు ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు ఊపిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలకు జోడీగా నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లోనూ పూజాహెగ్దే గుర్తుండిపోయే సినిమాలు చేసింది. ఇక ఇటీవల స్పెషల్ సాంగ్స్ తోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం 'కూలి'లో స్పెషల్ సాంగ్ లో నటించింది. తాజా స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు టీమ్. దీంతో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఒక్క సాంగ్ లో నటించేందుకు పూజా హెగ్దే ఎన్ని కోట్లు ఛార్జీ చేసిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా గుర్తింపు..
ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాలతో పూజా హెగ్దే తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తను నటించిన తొలి రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం అయ్యింది. దీంతో సినిమాకు మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. డీజే, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేశ్, అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మంచి సక్సస్ ను అందుకుంది. అలా వైకుంఠపురం చిత్రం తర్వాత బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకుంది.

మోనికా సాంగ్ తో దుమ్ములేపిన పూజా..
ప్రస్తుతం పూజా హెగ్దే పేరు ట్రెండింగ్ లో ఉంది. అందుకు కారణం పూజా హెగ్దే నటించిన స్పెషల్ సాంగ్ మోనికా విడుదలైంది. ఈ సాంగ్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలి' చిత్రంలోనిది కావడం విశేషం. త్వరలో సినిమాను విడుదల చేయబోతుండటంతో తాజాగా పూజా హెగ్దే నటించిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ లో పూజా హెగ్దేతో 'మంజుమేల్ బాయ్స్' స్టార్ శౌభిన్ శహిర్ నటించారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈ చిత్రానికి సుభలాషిని, అనిరుధ్ రవిచంద్ర గాత్రం అందించారు. ఇక అనిరుధ్ క్యాచీ ట్యూన్ ను అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవడం విశేషం.
పూజా హెగ్దే రెమ్యునరేషన్..
స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దే ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ లేకపోవడంతో ఇంకాస్తా తగ్గినట్టు తెలుస్తోంది. కాగా కూలి చిత్రంలోని మోనికా స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్దే ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. కేవలం ఒక్క సాంగ్ లో నటించేందుకు రూ.3 కోట్ల వరకు ఛార్జీ చేసిందని తెలుస్తోంది.
రాబోయే చిత్రాలు..
తెలుగులో చివరిగా ఆచార్య, ఎఫ్3 చిత్రంలోని స్పెషల్ సాంగ్ తో కనిపించింది పూజా హెగ్దే. అలాగే హిందీ కిసి కా బాయ్ కిసి కా జాన్, దేవ, తమిళంలో రెట్రో వంటి చిత్రాలతో అలరించింది. నెక్ట్స్ కూలీ, జన నాయగన్, హే జవానీ తో ఇష్క్ హోనా హై, కాంచనా 4 వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











