హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

చూపు తిప్పుకోకుండా చేసే అందం.. ప్రేక్షకులను ఫిదా చేయగల నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో టాలీవుడ్‌లో నిత్యం హైలైట్ అవుతోన్న హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ టైంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది. దీంతో వరుస సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ చిన్నది వరుస ఆఫర్లను అందుకుంటోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే తాజాగా ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

అలా వచ్చింది.. టాలీవుడ్ ఎంట్రీ

అలా వచ్చింది.. టాలీవుడ్ ఎంట్రీ

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే పూజా హెగ్డే మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అలా అందులో బిజీగా ఉన్నప్పుడే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అనంతరం వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' అనే సినిమాలోనూ నటించి అందరి దృష్టిలో పడింది.

మొదట్లోనే ఫ్లాపులు.. బాలీవుడ్‌లో

మొదట్లోనే ఫ్లాపులు.. బాలీవుడ్‌లో

పూజా హెగ్డే ఆరంభంలోనే చేసిన సినిమాలు హిట్ కాకున్నా వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు విజయం మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే కొన్ని తెలుగు సినిమాల్లో నటించాక హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో పూజా కెరీర్ ముగిసిపోతుందన్న కామెంట్లు వచ్చాయి.

ఎన్టీఆర్ సినిమా నుంచి ఊపుతూ

ఎన్టీఆర్ సినిమా నుంచి ఊపుతూ

రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకున్న పూజా హెగ్డేకు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొట్టమొదటి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని సత్తా చాటింది. అలాగే రెమ్యూనరేషన్‌నూ భారీగా పెంచేసింది.

ఇక్కడా... అక్కడా హవా చూపిస్తూ

ఇక్కడా... అక్కడా హవా చూపిస్తూ

బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్‌లో వరుస సినిమాలతో హవాను చూస్తోంది. ఆమె ఇప్పటికే 'రాధే శ్యామ్', 'ఆచార్య' షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసుకుంది. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న 'బీస్ట్'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ - పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోందీ బ్యూటీ.

 హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతోంది

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతోంది

చాలా కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న పూజా హెగ్డే.. అప్పుడప్పుడూ హాలీడే ట్రిప్‌లను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మాల్దీవులు వెళ్లొచ్చిన ఈ భామ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. అలాగే, తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం తరచూ షేర్ చేస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఈ అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

Date With Akhil Tour | Akhil Interaction With Crazy Girls
హాట్ బికినీతో రెచ్చిపోయిన పూజా

హాట్ బికినీతో రెచ్చిపోయిన పూజా

పూజా హెగ్డే అప్పుడప్పుడూ యమ హాట్ ఫొటోలను సైతం షేర్ చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె మాల్దీవుల్లో బికినీతో ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్ క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X