Pooja Hegde: మళ్లీ రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. చీరకొంగును జరిపి మరీ.. ఇలా చూపిస్తే తట్టుకోవడం కష్టమే!

పూజా హెగ్డే.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించే నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తద్వారా తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది. సినిమాల్లో సత్తా చాటుతోన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ అందరినీ ఫిదా చేసేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డే హాట్ ఫొటోను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్‌పై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా మొదలైన పూజా ప్రయాణం

అలా మొదలైన పూజా ప్రయాణం

సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది పూజా హెగ్డే. అలా అందులో బిజీగా ఉన్నప్పుడే 'మూగమూడి' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. అనంతరం 'ఒక లైలా కోసం' అనే సినిమాలోనూ నటించింది. కానీ, ఈవేమీ ఆమెకు విజయాన్ని అందించలేదు.

బాలీవుడ్ ఆఫర్.. అక్కడా నిరాశగా

బాలీవుడ్ ఆఫర్.. అక్కడా నిరాశగా

సినిమాలు హిట్ కాకున్నా కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు హిట్ మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే కొన్ని తెలుగు సినిమాల్లో నటించాక హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు.

 ఆ మూవీ నుంచి మారిన కెరియర్

ఆ మూవీ నుంచి మారిన కెరియర్

విజయం కోసం పరితపిస్తోన్న పూజా హెగ్డేకు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొట్టమొదటి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. అలాగే రెమ్యూనరేషన్‌నూ భారీగా పెంచేసి హాట్ టాపిక్ అయింది.

అందరి ఫస్ట్ చాయిస్‌గా మారింది

అందరి ఫస్ట్ చాయిస్‌గా మారింది

కొంత కాలంగా పూజా హెగ్డే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్', 'ఆచార్య' షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ - పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తూ హవా చూపిస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తెగ సందడి చేస్తోంది.

ఈ మధ్య ఎక్కువగా అలాంటివేగా

ఈ మధ్య ఎక్కువగా అలాంటివేగా

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన పూజా హెగ్డే.. అప్పుడప్పుడూ హాలీడే ట్రిప్‌లను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మాల్దీవులు వెళ్లొచ్చిన ఈ భామ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. అలాగే, తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం తరచూ షేర్ చేస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఈ అమ్మడు బాగా హైలైట్ అవుతోంది.

 చీరకొంగును పక్కకు జరిపి మరీ

చీరకొంగును పక్కకు జరిపి మరీ

సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోన్న పూజా హెగ్డే.. అప్పుడప్పుడూ పిచ్చ హాట్ ఫొటోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ పిక్‌లను షేర్ చేసింది. ఇందులో ఆమె నలుపు రంగు చీరను ధరించి పైటకొంగును పక్కకు తప్పించి ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు తెగ కనువిందు చేసేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X