For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘాటు ఫొటోలతో హీటు పెంచేసిన పూజా హెగ్డే: చిన్న క్లాత్‌ను మాత్రమే చుట్టుకుని అందాల విందు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తమ టాలెంట్‌ను నిరూపించుకుని ఈ గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకు వస్తుంటారు. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో తన అందచందాలతో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్ వెలుగొందుతోంది బుట్టుబొమ్మ పూజా హెగ్డే. కెరీర్ ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ బ్యూటీ.. కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోంది. దీంతో తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది పూజా హెగ్డే. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఫేమస్

  అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఫేమస్

  ముంబైకు చెందిన పూజా హెగ్డే చదువులో బాగానే రాణించింది. ఉన్నత విద్యాభ్యాసం పూర్తైన వెంటనే తన దృష్టిని గ్లామర్ ఫీల్డులోకి మళ్లించింది. ఇందులో భాగంగానే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును అందుకుంది. ఫలితంగా నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఇలా చాలా కాలం పాటు వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపింది. తద్వారా మోడల్‌గా ఉన్న సమయంలోనే భారీ స్థాయిలో పాపులర్ అయిపోయింది.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  టాలీవుడ్‌లోకి ప్రవేశం.. సక్సెస్ రాలేదుగా

  టాలీవుడ్‌లోకి ప్రవేశం.. సక్సెస్ రాలేదుగా


  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది పూజా హెగ్డే. అలా దేశ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీల్లో ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘మూగమూడి' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఒక లైలా కోసం' అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, గ్లామర్‌తో అందరినీ ఫిదా చేసేసింది. అదే సమయంలో ఎంతో మంది కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయి ఫాలోయింగ్ పెంచుకుంది.

  హిట్లు తక్కువే.. అయినా ఆఫర్లు ఎక్కువే

  హిట్లు తక్కువే.. అయినా ఆఫర్లు ఎక్కువే


  కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే పలు పరాజయాలను చవి చూడడంతో ఆమె కెరీర్ అర్థాంతరంగానే అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమెకు సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏకంగా హృతిక్ రోషన్ నటించిన ‘మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. మరోపక్క టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించిందీ భామ. తద్వారా చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుని సత్తా చాటింది.

  ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

  అలా సక్సెస్ ట్రాక్.. వరుసగా విజయాలు

  అలా సక్సెస్ ట్రాక్.. వరుసగా విజయాలు

  టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అదిరిపోయే ఆరంభాన్ని అందుకోలేకపోయిన పూజా హెగ్డే.. ఆ తర్వాత మాత్రం తన స్టామినాను చాటుకుంది. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బుట్టబొమ్మ.. ఆ తర్వాత వరుసగా ‘మహర్షి', ‘గద్దలకొండ గణేష్', ‘అల.. వైకుంఠపురములో' వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ ఎదిగిపోయింది. అదే సమయంలో రెమ్యూనరేషన్‌ను పెంచేసి భారీగా పెంచేసి ఫుల్లుగా అర్జిస్తోంది. దీంతో అందరికీ ఫస్ట్ చాయిస్ అవుతూ దూసుకుని పోతోంది.

  అక్కడా ఇక్కడా సత్తా.. భారీ ప్రాజెక్టులతో

  అక్కడా ఇక్కడా సత్తా.. భారీ ప్రాజెక్టులతో

  ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో పూజా హెగ్డే ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్' షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేసింది. ఇక, ఇప్పుడు ‘ఆచార్య'తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తోంది. ఇలా తన హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది పూజా.

  మెగా హీరోల కోసం అభిమాని సాహసం: సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, పవన్.. ఏ హీరో చేయని విధంగా!

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉండి

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉండి

  చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతూనే వస్తోంది.

  ఘాటు ఫోజులతో హీటు పెంచేసిన పూజా

  ఘాటు ఫోజులతో హీటు పెంచేసిన పూజా


  సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోన్న పూజా హెగ్డే.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఎద భాగంలో చిన్న క్లాత్‌ను చుట్టుకున్నట్లు కనిపించింది. ఫలితంగా క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. ఈ ఫొటోలు అన్నింట్లోనూ గ్లామర్ ట్రీట్ మాత్రం ఆకట్టుకుంటోంది. దీంతో బుట్టబొమ్మ పోస్ట్ చేసిన ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయ్యాయి.

  English summary
  Tollywood Star Heroine Pooja Hegde Very Active in Social Media. Now She Shared her Sizzling Hot Photos in Instagram
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X