టాప్ తీసేసి మరీ రెచ్చిపోయిన పూజా హెగ్డే: ఘాటు ఫొజులతో గతంలో చూడని విధంగా!
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో సందడి చేస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సాదాసీదా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో దక్కించుకుంది. ఇక, సోషల్ మీడియాలోనూ పూజా హెగ్డే తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో తన గ్లామర్ ట్రీట్‌తో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇవన్నీ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయమైన పూజా హెగ్డే
చిన్న వయసులోనే పూజా హెగ్డే మోడలింగ్ రంగంలోకి ఎంటరైంది. అక్కడ తన అందచందాలతో సందడి చేసింది. అప్పుడే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' అనే సినిమాలోనూ నటించి ఆరంభంలోనే హైలైట్ అయింది.

పూజాకు గ్రేట్ స్టార్ట్ దక్కలేదుగా
ఎన్నో ఆశలతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన పూజా హెగ్డేకు సరైన ఆరంభం దక్కలేదనే చెప్పాలి. మొదట్లో టాలీవుడ్‌లో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. అయినప్పటికీ ఆమె హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో'తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అయితే, అది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పూజా కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోతుందని అనుకున్నారు.

హిట్ ట్రాక్ ఎక్కాక... వరుసగానే
చాలా కాలం పాటు విజయం కోసం వేచి చూసిన పూజా హెగ్డేకు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని సత్తా చాటింది. అలాగే రెమ్యూనరేషన్‌నూ బాగానే తీసుకుంటూ దూసుకెళ్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది.

గ్లామర్ షోతో కాక రేపుతోందిగా
చాలా కాలంగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. ఇలా కొద్ది రోజులుగా పూజా హెగ్డే ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

ఫుల్ బిజీగా మారిన బుట్టబొమ్మ
ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె ఇప్పటికే 'రాధే శ్యామ్', 'ఆచార్య' షూటింగ్‌లను కూడా పూర్తి చేసుకుంది. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న 'బీస్ట్'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు హరీశ్ - పవన్ కలయికలో వచ్చే ప్రాజెక్టుతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న సినిమాలోనూ నటించబోతుంది.


Click it and Unblock the Notifications











