పూజా హెగ్డేకు ఘోర పరాభవం.. విమానంలో అసభ్య ప్రవర్తన.. భయమేసిందంటూ ట్వీట్!
హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న భామ పూజా హెగ్డే. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న పూజా హెగ్డే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుంటోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు ఇండిగో విమానయాన సంస్థ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అక్కడ కూడా నిరాశే
మంగళూరుకు చెందిన పూజా తల్లితండ్రుల కారణంగా ముంబైలోనే పుట్టిపెరిగింది. మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ప్రవేశించినా పెద్దగా పేరు రాలేదు. తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

వరుస అవకాశాలతో
మొదట్లో వరుస ప్లాపులతో ఇబ్బంది పడిన పూజా హెగ్డే 'అరవింద సమేత.. వీరరాఘవ'తో సక్సెస్ బాట పట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది. అయితే, ఇటీవలే ఆమె 'రాధే శ్యామ్', 'ఆచార్య' సినిమాలతో డిజాస్టర్ అయింది. ఆమె నటించిన విజయ్‌తో కలిసి చేసిన 'బీస్ట్' మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా వరుస అవకాశాలతో దూసుకువెళుతోంది.

అసభ్యంగా ప్రవర్తించాడని
తాజాగా పూజా హెగ్డే చేసిన ఒక ట్వీట్ వైరల్ అయింది. ఇండిగో స్టాఫ్ సిబ్బంది ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ముంబై నుంచి ఇండిగో విమానంలో బయలుదేరిన పూజా హెగ్డేతో విపుల్ నకాషే అనే స్టాఫ్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.

పట్టించుకోను కానీ
''నేను ముంబైలో ఇండిగో-6ఈ విమానం ఎక్కాను. విమాన సిబ్బంది విపుల్ నకాషే ఎలాంటి కారణం లేకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అహంకారంతో బెదిరింపులకు దిగాడు, మాపై గట్టి గట్టిగా అరిచాడు. నిజంగా అతడి మాటలు విని నాకు ఎంతో భయం వేసింది. సాధారణంగా ఇలాంటి విషయాలను నేను ఎక్కువగా పట్టించుకోను. కానీ ఈ వ్యక్తి ప్రవర్తన చూసి భయమేసింది. అందుకే ట్వీట్ చేస్తున్నాను.' అని ఆమె పేర్కొంది.
Recommended Video


జనగన మన షూటింగ్ లో
దీనికి ఇండిగో సంస్థ స్పందించింది, మీ చేదు అనుభవానికి క్షమించండి. మేము వెంటనే మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాము, దయచేసి మీ PNRని కాంటాక్ట్ నంబర్‌తో పాటు మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి అని పేర్కొన్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే సర్కస్ అనే సినిమా, కభీ ఈద్ కభీ దివాలీ అనే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న జనగన మన సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం పూజా పాల్గొంటోంది.


Click it and Unblock the Notifications











