మహేష్ బాబు సినిమా కోసం పూజా హెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్.. ఆమెనే ఎందుకు ఫైనల్ చేశారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్ మూవీ లాంచ్ అయ్యింది. ఎప్పటి నుంచో చర్చల దశలో ఉన్న మహేష్ బాబు 28వ సినిమా మొత్తానికి నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలోలో పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి వచ్చేసింది. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి పూజా హెగ్డేను తీసుకున్నాడు. ఆమెకు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుట్టబొమ్మను ఈ సినిమాకు ఎందుకు తీసుకున్నారు అనే విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఎప్పుడైతే బికినిలో దర్శనమిచ్చిందో..

ఎప్పుడైతే బికినిలో దర్శనమిచ్చిందో..

అల.. వైకుంఠపురములో సినిమా సక్సెస్ ఆయన అనంతరం పూజా హెగ్డే అస్సలు తగ్గడం లేదు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా డీజే సినిమా అనంతరమే పూజ ఫేట్ మారిపోయింది. ఎప్పుడైతే బికినిలో దర్శనమిచ్చిందో అమ్మడి గ్లామర్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.

 త్రివిక్రమ్ తో వరుస సినిమాలు

త్రివిక్రమ్ తో వరుస సినిమాలు

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పూజా హెగ్డే ఇదివరకే రెండు సినిమాలు చేసింది. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ అనంతరం మళ్ళీ అల.. వైకుంఠపురములో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అనంతరం బుట్టబొమ్మ జాతకం ఒక్కసారిగా మారిపోయింది. మళ్ళీ బాలీవుడ్ లో కూడా ఆఫర్లు అందుకునే స్థాయికి వచ్చేసింది.

ఎవరు ఊహీంచలేదు..

ఎవరు ఊహీంచలేదు..

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడవ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం లక్కీ అనే చెప్పాలి. మహేష్ బాబుతో అతడు, ఖలేజా సినిమాల అనంతరం త్రివిక్రమ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న SSMB28 పై అంచనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే సెలెక్ట్ అవుతుందని ఎవరు ఊహీంచలేదు.

రాధేశ్యామ్ కూడా విడుదలకు

రాధేశ్యామ్ కూడా విడుదలకు

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేయడమే కాకుండా రాధేశ్యామ్ కూడా విడుదలకు సిద్దంగా ఉండడంతో పూజ రేంజ్ మరింత పెరుగుతోంది. అలాగే కోలీవుడ్ లో విజయ్ బీస్ట్ లో కూడా నటిస్తోంది. ఎటు చేసుకున్నా పూజా రేంజ్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. పైగా త్రివిక్రమ్ సెంటిమెంట్ గా రిపీట్ చేసిన హీరోయిన్ తో సక్సెస్ కొడుతుంటాడు. ఈ కారణాలతో పూజను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా సినిమాలో గ్లామర్ ప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉండడం కోసం బుట్టబొమ్మను తీసుకున్నారట.

రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక ఈ ప్రాజెక్ట్ కోసం పూజ హెగ్డే రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకున్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం పూజ రెండున్నర కోట్లకు పైగా పారితోషికం తీసికుంటోంది. పాన్ ఇండియా సీనిమాలకైతే మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇక మహేష్ సినిమా కోసం కూడా రెండున్నర కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ స్థాయిలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే వచ్చే ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X