ఐటెమ్ సాంగ్‌తో హాట్‌గా పూజా హెగ్డే.. సూపర్ స్టార్ మూవీలో స్పెషల్ అప్పీయరెన్స్!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అక్కడి స్టార్ హీరోలకు జోడీగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ క్రమంలో పూజా హెగ్దే గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ గా మారింది. పూజా హెగ్దే తెలుగు కొన్ని గుర్తుండిపోయే సినిమాలు చేసింది. 'ఒక లైలా కోసం' చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. తొలిచిత్రంతో మంచి ఆడియెన్స్ నుంచి మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. అక్కినేని నాగచైతన్య - పూజాహెగ్దే జంటగా నటించిన ఆ చిత్రం హిట్ అయ్యింది. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూజా హెగ్దేకు మంచి అవకాశాలు అందాయి.

ముకుంద, డీజే, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, ఆచార్య వంటి చిత్రాల్లో హీరోయిన్ నటించి మెప్పించింది. టాలీవుడ్ స్టార్ హీరోలకు పక్కన బిగ్ స్క్రీన్ తన పెర్ఫామెన్స్ తేలిపోకుండానే పెర్ఫామ్ చేసింది. తన అందం, అభినయంతో తెలుగు వారి గుండెల్లో కాస్తా చోటు దక్కించుకుంది. ఆమె నటించిన చిత్రాల్లో దాదాపు అన్నీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ తమిళ చిత్రాల్లోనే ఫుల్ బిజీగా అయ్యింది.

Pooja Hegde Special Appearance in Superstar Rajinikanth s Upcoming film

అయితే.. పూజాహెగ్దేకు హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆడియెన్స్ లో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కు అప్పట్లో ఆడియెన్స్, యువత ఊగిపోయారు. థియేటర్లలో ప్రేక్షకులు ఊర్రూతలూగిపోయారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత 'ఎఫ్3'లో పూజా హెగ్దే స్పెషల్ అపీయరెన్స్ ఇచ్చింది. 'లైఫ్ అంటే ఇట్ట ఉండాలా' అంటూ ట్రెండ్ సెట్ చేసింది.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పూజా హెగ్దే స్పెషల్ అపీయరెన్స్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నా.. తన వైబ్ చూపించేందుకు ఐటెమ్ నెంబర్ లో నటించేందుకు గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది.. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న 'కూలీ' చిత్రంలో కావడం విశేషం. ఇప్పటికే లోకేష్ పూజా హెగ్దేను ఫైనల్ చేశారంట. పూజా హెగ్దే స్పెషల్ అపీయరెన్స్ ద్వారా మాస్ ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకునేందుకు ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Pooja Hegde Special Appearance in Superstar Rajinikanth s Upcoming film

ఇప్పటికే పూజా హెగ్దే సూర్యతో 'రెట్రో', దళపతి విజయ్ సరసన 'జన నాయగణ్', 'కాంచన 4' చిత్రాల్లో బిగా ఉంది. 'రెట్రో' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మిగితా చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. హిందీలోనూ మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈలోగా 'కూలీ'లోనూ స్పెషల్ అపీయరెన్స్ అంటూ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే కింగ్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. 2025లోనే గ్రాండ్ గా విడుదల కాబోతోందీ చిత్రం. సన్ పిక్చర్స్ గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తోంది.

More from Filmibeat

Read more about: pooja hegde coolie rajinikanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X