Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తళుక్కుమన్న పూజా హెగ్డే అందాలు.. క్లీవేజ్ షోతో పరేషాన్ చేసేసిందిగా
Recommended Video
ముకుంద సినిమాతో టాలీవుడ్ గడప తొక్కిన పూజా హెగ్డే అక్కడక్కడా తడబడినా బాగానే నిలదొక్కుకుంటోంది. అల్లు అర్జున్ సరసన డీజే లో వేసిన చిందులు ఆమెకు బాగా ప్లస్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో వరుసగా జతకట్టే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని ఏ మాత్రం దుర్వినియోగం చేసినా కెరీర్ పరంగా లాస్ అవుతానని భావించిన పూజా తన పర్ఫార్మెన్స్తో మెప్పిస్తూనే అందాలు ఆరబోయడంలో కూడా వెనకాడటం లేదు.
కెమెరా కళ్లన్నీ పూజా పైనే..
సాధారణంగా తమ తమ సినిమా ఫంక్షన్స్ అంటే హీరోయిన్లు కాస్త మోడ్రెన్ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటారు. అదే కోవలో తన 'మహర్షి' సినిమా విజయోత్సవ సభలో అందరి కళ్లు, ముఖ్యంగా కెమెరా కళ్లు తనపై పడేలా క్లీవేజ్ షోతో మైమరిపించింది పూజా. దీంతో ఈ వేడుకలో పూజా అందాలే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
ఎరుపు రంగు డ్రెస్‌లో యమ హాట్‌గా
ఎరుపు రంగు డ్రెస్ ధరించిన పూజా యమ హాట్‌గా కనిపించింది. ఎరుపు రంగు స్లీవ్ లెస్ ఛోళీ, దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా అదే రంగు లెహెంగా ధరించి ఆకట్టుకుంది. ఇక చున్నీని చేతిలో పట్టుకొని అందాల ప్రదర్శనకు అడ్డే లేదన్నట్లుగా హాయిగా ఫోజులిచ్చింది. ఆ గెటప్ లో ఆమె ధరించిన నెక్లెస్ అందరి చూపును లాగేస్తూ అందాల విందులో భాగమైంది. డ్రెస్ కి తగ్గ హెయిర్ స్టైల్ తో, క్లీవేజ్ షో చేసి మొత్తానికి విజయోత్సవ సభను రక్తికట్టించింది పూజా.
ఇక ప్రభాస్ తో కూడా రెడీ అంటోంది
మహర్షి సినిమాలో మహేష్ తో జోడీ కట్టిన పూజా హెగ్డే.. ఇక ప్రభాస్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో ప్రభాస్ చెంత చేరి చిందులేయనుంది లేలేత అందాల పూజా. దీంతో పాటు బాలీవుడ్ లో బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 లో కూడా నటిస్తోంది పూజా హెగ్డే.
మహర్షి మూవీ
ఇక మహర్షి విషయానికొస్తే ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమాగా మహేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిందీ చిత్రం. వంశీ పైడిపెల్లి టేకింగ్, చిత్రంలో పొందుపర్చిన సామజిక అంశాలు చిత్రానికి మంచి పేరు తెచ్చిపెట్టడమే గాక భారీ కలెక్షన్స్ రాబట్టేందుకు బాటలు వేశాయి. చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటనకు, మహేష్ ఫ్రెండ్‌గా అల్లరి నరేష్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.