భారీ మల్టీస్టారర్‌లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్: 4 నిమిషాలకు పాటకు రెమ్యూనరేషన్ ఎంతంటే!

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా విపరీతంగా కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానుల ఆలోచనా ధోరణిలో మార్పులు రావడానికి తోడు హీరోలు సైతం ఈ తరహా సినిమాలు చేయడానికి ధైర్యం చేస్తున్నారు. అంతేకాదు, ఇలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో చాలా కాలంగా తెలుగులో మల్టీస్టారర్ మూవీలు మరిన్ని పట్టాలెక్కుతున్నాయి. ఇలా కొన్నేళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకున్న చిత్రమే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). దీనికి సీక్వెల్‌గా F3 రూపొందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలిసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం!

 మరోసారి ఇద్దరు అల్లుళ్ల సందడి

మరోసారి ఇద్దరు అల్లుళ్ల సందడి

'F2' సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా 'F3'ని రూపొందించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'F3' పేరిట ఈ సినిమాను రెండేళ్ల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా వెంటనే మొదలు పెట్టేశారు.

వాళ్లు కూడా భాగం అయ్యారుగా

వాళ్లు కూడా భాగం అయ్యారుగా


సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున చిత్రమే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇప్పుడు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగం అయ్యారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నాడు.

ఆ పాయింట్‌తో వస్తున్న సినిమా

ఆ పాయింట్‌తో వస్తున్న సినిమా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'F3'లో ముగ్గురు హీరోలు నటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ సినిమా సన్నివేశాలను షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు.

ఈ మూవీలో హైలైట్లు ఎంటంటే

ఈ మూవీలో హైలైట్లు ఎంటంటే

'F2' మాదిరిగానే దానికి సీక్వెల్‌గా రాబోతున్న 'F3'ను కూడా దర్శకుడు అనిల్ మరింత ఫన్నీగా రూపొందిస్తున్నాడు. ఇందులో భాగంగానే హీరో వెంకటేష్‌కు రేచీకటి సమస్యను ఇందులో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సునీల్‌తో సరికొత్త ట్రాకును తీసుకొచ్చి నవ్వించబోతున్నాడట. అలాగే, సోనాల్ చౌహాన్‌ను కూడా ఈ సినిమాలో భాగం చేసిన విషయం తెలిసిందే.

రిలీజ్ అప్పుడే.. అంచనాలతో

రిలీజ్ అప్పుడే.. అంచనాలతో

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'F3' మూవీని మరింత ఫన్నీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను మే 27న విడుదల చేయబోతున్నారు. ఇక, దీని నుంచి తెలుస్తోన్న అప్‌డేట్ల కారణంగా ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడుతున్నాయి.

ఆ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్

ఆ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్


వరుణ్ తేజ్ - వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'F3' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇప్పటికే దీనికి ఆమె సంతకం కూడా చేసిందని టాక్.

పూజా రెమ్యూనరేషన్ ఎంతంటే!

పూజా రెమ్యూనరేషన్ ఎంతంటే!


'F3'లో స్పెషల్ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశాడట. దీని కోసం పూజా హెగ్డేను ఇటీవలే నిర్మాత దిల్ రాజు ఒప్పించారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారని తెలుస్తోంది. కేవలం నాలుగు నిమిషాల పాట కోసం ఆమె అంత తీసుకుంటుందన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X