Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Pooja Hegde ఆ అనుభవం నన్ను మార్చేసింది.. తిరిగి ఇచ్చేయాల్సిందే అంటూ బుట్ట బొమ్మ ఎమోషనల్
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేసుకొంటూ భారీగా రెమ్యునరేషన్ తీసుకొంటున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సమాజ సేవలో నిమగ్నమయ్యేందుకు నిర్ణయం తీసుకొన్నారు. షూటింగులతో బిజీగా ఉంటూనే సమాజానికి తన వంతుగా సేవ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు బుట్ట బొమ్మ ప్రకటించారు. తన కంటూ స్థానం ఇచ్చిన ప్రేక్షకులు, ప్రజల రుణం తీర్చుకొనేందుకు ఓ సంస్థను ఆరంభించారు. ఆ ఫౌండేషన్ వివరాల్లోకి వెళితే...
కరోనావైరస్కు ముందే..
కరోనావైరస్ మహమ్మారి రాకముందే ఆల్ ఎబౌట్ లవ్ అనే ఫౌండేషన్‌ను నా స్నేహితులతో కలిసి ప్రారంభించాను. కానీ లాక్డౌన్ కారణంగా ఆ కార్యక్రమాలను ప్రారంభించలేకపోయాను. ఎలాంటి పనులు ప్రారంభించకుండా ఫౌండేషన్ పేరును బయటకు వెల్లడించడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ప్రస్తుతం కార్యక్రమాలను ప్రారంభించి ఫౌండేషన్ గురించి వెల్లడిస్తున్నాను అని పూజా హెగ్డే తెలిపారు.
ఆల్ ఎబౌట్ లవ్ ఫౌండేషన్‌తో
ఆల్ ఎబౌట్ లవ్ అనే ఫౌండేషన్ ద్వారా కరోనాతో చిధ్రమైన జీవితాలను, బాధితులను ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నాను. ఓ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి బాధితులకు అవసరమైన విషయాలను తెలుసుకొంటాం. మెడికల్ వసతులు, రేషన్ అందించడం కాకుండా చాలా పనులు చేయాలని, అనేక సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నాం అని పూజా హెగ్డే పేర్కొన్నారు.
కరోనా బాధితులకు అండగా
కరోనా వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకొన్నాను. ఆ వ్యాధి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని స్పష్టంగా, స్వయంగా అనుభవాన్ని చవిచూశాను. ఒకరి జీవితంలో కోవిడ్ ఎలాంటి కష్టాలను తీసుకోస్తుందనే విషయాలు నా దృష్టికి వస్తున్నాయి అని పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాధితులకు అండగా ఉండేందుకు ఆల్ ఎబౌట్ లవ్ ప్రారంభించాం అని తెలిపారు.
ఆదరించిన వారికి అప్పన్నహస్తం
సినీ రంగంలో నన్ను నటిగా ఆదరించారు. ప్రజలు నాకు గుర్తింపును ఇవ్వడమే కాకుండా ఎన్నో విలువైన అంశాలు అందించారు. నా కెరీర్‌కు, సమాజంలో హోదా అంటూ కల్పించిన వారికి తిరిగి కొంత ఇవ్వాలని అనుకొంటున్నాను. ఆ ప్రయత్నమే ఆల్ ఎబౌట్ లవ్. ఈ ఫౌండేషన్ ద్వారా మరింత సేవ చేయాలని అనుకొంటున్నాను అని పూజా హెగ్డే పేర్కొన్నారు.
పూజా హెగ్గే కెరీర్ ఇలా...
పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ప్రభాస్‌తో కలిసి నటించిన రాధే శ్యామ్ చిత్రం విడులకు ముస్తాబవుతున్నది. చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే తమిళంలో విజయ్‌తో బీస్ట్ అనే చిత్రంలోను, అలాగే ధనుష్‌తో మరో చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే ఓ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇంకా హిందీలో రణ్వీర్ సింగ్‌తో సర్కస్, అలాగే మరో చిత్రం భాయ్‌జాన్ చిత్రంలో నటిస్తున్నారు.