twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్.. నాతో సన్నిహితంగా ఉన్నవాళ్లు అంటూ..

    |

    బాలీవుడ్, టాలీవుడ్ రంగాల్లో అద్బుతంగా రాణిస్తున్న పూజాహెగ్డే కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులను కోవిడ్19 వైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా ఆ జాబితాలో పూజా హెగ్డే చేరారు. తాజాగా తనకు కరోనావైరస్ పాజిటివ్ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పూజా హెగ్డే ట్వీట్‌లో వెల్లడించిన ప్రకారం..

    Pooja Hegde tested coronavirus positive

    ప్రతీ ఒక్కరికి నమస్కారం. నాకు కోవిడ్19 పాజిటివ్ అనే విషయం తేలిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నాను. ఈ క్రమంలో నాకు నేనుగా క్వారంటైన్ అయ్యాను. కోవిడ్19, ప్రభుత్వ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని తన ట్విట్టర్‌లో తెలిపారు.

    గత కొద్ది రోజులుగా నాకు దగ్గరగా, సన్నిహితంగా ఉన్న వారు జాగ్రత్తలు తీసుకొండి. వీలైనంత త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను అని పూజాహెగ్గె పేర్కొన్నారు.

    నేను ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నాను. త్వరగా కోలుకొంటాననే భరోసా నాలో కనిపించింది. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరుకి ధన్యవాదాలు. దయచేసి మీరు ఇంటి వద్దనే ఉండండి.. క్షేమంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకొండి అంటూ కామెంట్ చేశారు.

    ఇదిలా ఉండగా పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.., అఖిల్ అక్కినేనితో కలిసి పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

    English summary
    Actress Pooja Hegde tested coronavirus positive. She tweeted that, Hello everyone. This is to inform you all that I have tested positive for Covid-19. Following alll the protocals. I have Isolated and home quarantined my self.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X