ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించిన బుట్టబొమ్మ.. హిట్టయితే మామూలుగా ఉండదట

టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆమె అదృష్టం ఏమిటో గాని బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంతో ఒక్కసారిగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. చాలా వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక రిజెక్ట్ చేయాల్సి వస్తోందట. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో అయితే ఆమె కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి హిట్స్ అందుకుంటోంది. ఇక త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శాకుంతలం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించడానికి సిద్ధమైందట. హిస్టారికల్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమా కథ వినగానే అమ్మడు చాలా ఇంప్రెస్ అయ్యిందట. ఇక గుణశేఖర్ ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేనని ముందే చెప్పాడట.

Pooja hegde title role in guna shekar new project

ప్రస్తుతం పూజా రెమ్యునరేషన్ 2కోట్లకు చేరింది. ఇక అంత ఇవ్వలేనని చెప్పడంతో పూజా హెగ్డే మొదట కొంత ఆలోచించినప్పటికి ఆ తరువాత స్టోరీ చాలా బావుందని వెంటనే ఒప్పేసుకుందట. టైటిల్ రోల్ కాబట్టి సినిమా హిట్టయితే తన స్థాయి మరో లెవెల్ కు చేరుకుంటుందని, ఆఫర్ ను వదులుకోలేక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకే రెమ్యునరేషన్ తక్కువైనా కూడా ఒప్పుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X