రేటు పెంచే ఆలోచనల్లో పూజా హెగ్డే.. డిమాండ్‌ను క్యాష్ చేసుకొనే పనిలో బుట్టబొమ్మ!

ఒకప్పుడు దక్షిణాది సినిమా దగ్గర ఫుల్ బిజీగా ఉన్న యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకామె అని అందరికీ తెలిసిందే. అక్కినేని యువ హీరో అక్కినేని నాగ చైతన్యతో చాలా చిన్న డెబ్యూ ఆమె ఇచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడను కూడా లేదు అయినా అందరిలో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ నుంచి గ్లామర్ డోస్ పెంచుతూ కెరీర్ స్టార్టింగ్ లోనే ఐటెం సాంగ్ చేసి షాకిచ్చింది.

ఇలా హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా కనిపిస్తూ వచ్చిన పూజా హెగ్డే అపుడు ఏకంగా టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎవరికి అయినా ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్ గా మారింది. దీనితో పాటుగా గోల్డెన్ లెగ్ ట్యాగ్ కూడా పూజాకి బాగా ప్లస్ అయ్యింది. కానీ తర్వాత ఊహించని విధంగా పూజా హెగ్డే డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. దాదాపు ఒక టైం లో పూర్తిగా ఖాళీ అయ్యిపోయింది.

pooja hegde fate did not changed even continues offers she is waiting

కానీ ఫైనల్ గా మళ్ళీ ఇపుడు ఫుల్ బిజీగా మారిపోయింది. ఇపుడు ఆమె సినిమాలు స్టార్ట్ చేయడంతోనే మెయిన్ గా తమిళ సినిమా నుంచి అయితే వరుసగా ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తన నుంచి అనౌన్స్ అవుతూ వస్తుండగా ఇపుడు కోలీవుడ్ భారీ మల్టీ స్టారర్ సినిమా "కూలీ"లో కూడా ఆమె నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

కాగా మళ్ళీ ఏదొకలా ఫామ్ లోకి వచ్చిన పూజా హెగ్డే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కానీ ఈమెకి ప్రస్తుతం టఫ్ టైం లోనే నడుస్తుందత. కాగా ఇపుడు పూజా ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చే పరిస్థితి లేదట. ఇపుడు కూలీ స్పెషల్ సాంగ్ కి కూడా కేవలం కోటిన్నర మాత్రమే అందుకుంటుంది అని తెలుస్తుంది. ఇంకా తన నుంచి సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యినవి ఏవి లేవు సో నిర్మాతలు ఎంత ఇస్తే అంతే ఆమె తీసుకుంటుందట.

pooja hegde fate did not changed even continues offers she is waiting

ముందు అయితే తనకి వరుస అవకాశాలు కావాలి అందుకే వచ్చినవాటిని ఓకే చేసి రీజనబుల్ గా ఉన్నాసరే రెమ్యునరేషన్ పరంగా ఆలోచించకుండానే ఓకే చేసేస్తుందట. ఒక్కసారికి మళ్ళీ కానీ క్లిక్ అయితే అపుడు పూజా హెగ్డే రేటు మళ్ళీ పెంచే ప్లానింగ్ లో ఉన్నట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

సో పూజా హెగ్డే ప్రస్తుతం ఒక సరైన సమయం కోసం చూస్తుంది అని చెప్పాలి. కాగా ఇపుడు పూజా కూలీ లోనే కాకుండా తమిళ్ లో హీరో సూర్యతో రెట్రో, అలాగే విజయ్ దళపతి కాంబినేషన్ లో జన నాయగన్ అనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ తెలుగులో మాత్రం తనకి ఇంకా ఒక్క ఆఫర్ కూడా లేదు. మరి మళ్ళీ తెలుగులోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: pooja hegde coolie jana nayagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X