Samantha పై పూజా హెగ్డే మైండ్ గేమ్.. స్పెషల్ సాంగ్ కోసం ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్!
టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో సమంత, తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్గే లాంటి తారలందరూ ఐటెం సాంగ్స్‌తో ఆలరిస్తున్నారు. అయితే స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయడమనే సినిమాకు భారీ ఆకర్షణగా మారింది. అయితే ఇటీవల స్పెషల్ సాంగ్స్‌తో దుమ్మురేపుతున్న పూజా హెగ్డే, సమంత తమ రెమ్యునరేషన్ విషయంలో పోటి ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువ తీసుకొన్నారంటే..

రంగస్థలంలో జిగేల్ రాణిగా పూజాహెగ్గే
రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో జిగేల్ రాణిగా నటించి అభిమానులను ఖుషీ చేశారు. అయితే ఆ సినిమాకు పూజా స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాంతో టాప్ హీరోయిన్లు తమకు అలాంటి అవకాశాలు వస్తే.. ముందు వెనుకా ఆలోచించడం లేదు అనే స్పష్టంగా కనిపిస్తున్నది.

ఊ అంటావా అంటూ సమంత
పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. అప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో హిందీ చిత్రసీమలో అభిమానులు సంపాదించుకొన్న సమంత.. ఊ అంటావా.. ఊఊ అంటావా పాటతో మరింత పాపులారిటిని సంపాదించింది.

F3లో స్పెషల్ సాంగ్ కోసం
ఇక వరుస హిట్లు, అగ్రనటులతో భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న పూజా హెగ్డే కూడా స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ భారీ పారితోషికాన్ని అందుకొంటున్నది. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న F3 చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించడం ట్రెండింగ్‌గా మారింది.

పుష్ప కోసం సమంత రెమ్యునరేషన్
ఇదిలా ఉంటే, స్పెషల్ సాంగ్స్‌లో నటించిన పూజా హెగ్డే, సమంత రుత్ ప్రభు రెమ్యునరేషన్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప సినిమాలో ఒక్క పాటలో నటించడానికి సమంత దాదాపు 1.5 కోట్ల పారితోషికం తీసుకొన్నదనే విషయం ఇండస్ట్రీలో వైరల్ అయింది. ఒక్కపాటకు ఆ రేంజ్ రెమ్యునరేషనా? అంటూ అనుకోవడం తెలిసిందే.

F3 కోసం పూజా హెగ్డే పారితోషికం
స్పెషల్ సాంగ్స్‌లో నటించే విషయంలో పూజా హెగ్డే కూడా భారీగా పారితోషికం పిండేసిందనే విషయం ఇప్పుడు మరో హాట్ టాపిక్. F3 చిత్రంలోని పాటలో కనిపించినందుకు పూజా హెగ్డే సుమారు 1.75 కోట్లు తీసుకొన్నదనే విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం సమంత కంటే తనకే డిమాండ్ ఉందనే విషయాన్ని ప్రూవ్ చేయడానికే ఆ రేంజ్ పారితోషికానికి డిమాండ్ చేసిందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











