For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రివిక్రమ్‌తో 3వ రౌండ్ అంటూ స్టార్ హీరోయిన్ కామెంట్.. దారుణమైన ట్రోల్స్.. హీరో ఒప్పుకుంటాడా?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రచయితగా సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటల మాంత్రికుడిగా కూడా విభిన్నమైన తరహాలో ప్రేక్షకులకు బాగా దగ్గరైన త్రివిక్రమ్ సినిమా సినిమాకు తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అయితే అప్పుడప్పుడు సినిమా కెరీర్ లో కొన్ని కాపీ ఆరోపణలు ఉన్నప్పటికీ వాటి కారణంగా ఆయన పెద్దగా ఇబ్బంది పడింది లేదు.

  ఎక్కువగా త్రివిక్రం హాలీవుడ్ సినిమాలను ప్రేరణ పొంది సన్నివేశాలను ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అజ్ఞాతవాసి పై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఒక హీరోయిన్ చేసిన కారణంగా దర్శకుడు త్రివిక్రమ్ పై అనేక రకాల మీమ్స్ అవుతున్నాయి.

  హీరోయిన్స్ విషయంలో..

  హీరోయిన్స్ విషయంలో..

  త్రివిక్రమ్ సాధారణంగా ఎవరితో అయినా సరే ఒక సినిమా చేసాడు అంటే వీలైనంత వరకు మరొకసారి వారితోనే మరొక సినిమా చేయాలని అనుకుంటాడు. కాస్త కనెక్ట్ అయిన కూడా నటీనటులను మాత్రమే కాకుండా టెక్నీషియన్స్ రిపీట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుత రోజుల్లో హీరోలు అయితే కథానాయికలను పెద్దగా రిపీట్ చేయడం లేదు కానీ దర్శకులు మాత్రం కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి కూడా రిపీట్ చేయడం జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పదే పదే హీరోయిన్స్ ను రిపీట్ చేయడంతో ఆయనపై ఒక కామెంట్ అయితే ఉంది. గతంలోనే రెండుసార్లు హీరోయిన్లను రిపీట్ చేశాడు.

  సమంతను వరుసగా మూడు సార్లు

  సమంతను వరుసగా మూడు సార్లు

  నువ్వే నువ్వే సినిమా తో దర్శకుడిగా మొదలైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయాణం లో చాలాసార్లు హీరో హీరోయిన్స్ ని అదే పనిగా రిపీట్ చేశాడు. ఇక హీరోల విషయం పక్కనపెడితే హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ డైరెక్ట్ చేస్తుండడంతో ఆ విషయం సోషల్ మీడియాలో కొంత వైరల్ గా మారింది.

  అప్పట్లో జల్సా సినిమా తర్వాత ఇలియానాకు జులాయి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అఆ సినిమాలలో సమంతను వరుసగా మూడుసార్లు హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాడు. సమంతను సరికొత్తగా ప్రజెంట్ చేయడంతో మూడు సినిమాలు సెంటిమెంట్ గా కూడా వర్కవుట్ అయ్యాయి.

  మీమ్స్ వైరల్

  దీన్నిబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సెంటిమెంట్ ను కూడా ఫాలో అవుతాడు అని అర్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం పూజా హెగ్డేపైనే ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. దానికి తోడు మీమ్స్ కూడా త్రివిక్రమ్ పేరును ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. 2018లో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్ అందులో పూజా హెగ్డేను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.

  ఆతర్వాత 2020లో అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా బుట్ట బొమ్మ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ బుట్ట బొమ్మని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మొన్నటివరకు ఒక టాక్ వైరల్ అయ్యింది.

  ట్వీట్ లో రౌండ్ 3 అంటూ

  ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇటీవల పూజ హెగ్డే చేసిన ట్వీట్ తో ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. త్రివిక్రమ్ - హారిక హాసిని ప్రొడక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నట్లు చెప్పేసింది. మహేష్ బాబుకు రెండోసారి జోడిగా నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పేసింది.

  అలాగే రౌండ్ 3 అంటూ కూడా పూజా అందులో మెన్షన్ చేయడం వర్గం వారికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా రౌండ్ 3 అనేది వైరల్ గా మారింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు విషయంలో మహేష్ బాబు ఇప్పటి వరకూ పెద్దగా స్పందించింది లేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈరోజుల్లో మీన్స్ వైరల్ అవుతున్న డంతో మహేష్ బాబు ఒప్పుకుంటాడా లేదా అనేది మరి ఇంత హాట్ టాపిక్ గా మారింది.

  #HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu

  చేతిలో ఉన్నవన్నీ మంచి సినిమాలే..

  ఇక ఇది వరకే అయితే ఈ బ్యూటీ మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019 లో వచ్చిన ఆ సినిమా బాక్సాపీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో ఈ అమ్మడు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలే ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో పాటు ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాదేశ్యామ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించింది. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే కోలీవుడ్లో స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ అనే సినిమా చేస్తోంది. కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా విజయాన్ని అందుకుంటే తర్వాత ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందట.

  English summary
  Pooja hegde trivikram round 3 comments viral in imtarnet world
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X